రాసుకునేదే రాత, పడే కష్టమే విధి

Update: 2016-02-07 09:30 GMT
ఏదైన చెడు జరగ్గానే మనుషుల్లో ఉండే సహజమైన అలవాటు.. అది మన తలరాత అనుకోవడం. అలా రాసి పెట్టి ఉంటే ఏం చేస్తాం అనుకుంటారు. తమకో, తమవారికో జరిగితే బాధ పడతారు, పక్కనోళ్లకైతే జాలి పడతారు. అంతా విధి రాత అని సరిపెట్టుకుంటారు. కానీ స్వీటీ అనుష్క మాత్రం ఇలాంటి మాటలంటే చిరాకు అంటోంది. తలరాత మాట చెప్పి ఆగిపోయేవాళ్లంటే తలనొప్పి అని చెబ్తోంది.

'విధి, రాత అనే మాటలు నాకు నచ్చవు. సంకల్పం ఉంటే ఏదైనా సాధించచ్చు. మనలో సంకల్పం ఉండాలే కానీ.. విధి కూడా మనం చెప్పినట్లు వింటుందని నాకు గట్టి నమ్మకం. కష్టం వస్తే ఎదిరించే ధైర్యం తెచ్చుకోవాలి. ఆ డేర్ మనలో ఉంటే ఎంత కష్టమైనా కుంగిపోయి పారిపోతుంది. అదే మనమే కుంగిపోతే చిన్న సమస్య అయినా చాలా పెద్దదిగా కనిపిస్తుంది. దీన్ని నేను బాగా నమ్ముతాను. నా చుట్టూ ఉన్నోళ్లకి కూడా చెబ్తాను. రాత అంటే మనం రాసుకునేదే. విధి అంటే మనం పడే కష్టమే' అంటూ పెద్ద లెక్చర్ ఇచ్చేసి ఆశ్చర్యపరిచింది అనుష్క.

ఇంత అందంగా కనిపించే ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ ఇంతటి అభ్యుదయ భావాలు ఉండడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. ప్రస్తుతం బాహుబలి సీక్వెల్ తో పాటు, సింగం3 లో నటిస్తున్న స్వీటీ.. నటి అవుదామనే ఇండస్ట్రీకొచ్చాను, పది ఇరవై ఏళ్ల తర్వాత కూడా చెప్పుకునే కొన్ని సినిమాలు చేశాను.. ఇక ఇలాంటి రోల్స్ చేయాలి అనే విషయంలో పెద్దగా కోరికలేమీ లేవని చెప్పడం విశేషం.
Tags:    

Similar News