• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బ్రేకప్ అయిందని...

బ్రేకప్ అయిందని ఒప్పుకున్న అనుపమ

By - Tupaki Desk
Update: 2021-07-11 06:37 GMT
పేరుకు మలయాళ అమ్మాయే అయినా.. తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఆమె మలయాళం, తమిళ భాషల్లోనూ నటించినప్పటికీ.. ఎక్కువ సినిమాలు చేసింది, ఎక్కువ ఫాలోయింగ్ తెచ్చుకున్నది తెలుగులోనే. ఆమెకు సంబంధించిన ఏ వార్త బయటికి వచ్చినా ఎంతో ఆసక్తిగా చూసేది కూడా తెలుగు వాళ్లే. సినీ కెరీర్లో ఇప్పటిదాకా అనుపమకు సంబంధించి ఏ వివాదాలూ, రూమర్లూ లేవు కానీ.. ఆమె భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ బుమ్రాతో ప్రేమలో ఉన్నట్లు అప్పట్లో జోరుగా ప్రచారం జరగడం తెలిసిందే. బుమ్రా, అనుపమ కలిసి ఎప్పుడూ కనిపించలేదు కానీ.. వీరి మధ్య ఏదో ఉన్నట్లు మాత్రం ఊహాగానాలు బలంగానే వినిపించాయి. కట్ చేస్తే.. కొన్ని నెలల కిందటే బుమ్రా.. సంజన అనే స్పోర్ట్స్ ప్రెజెంటర్‌ను పెళ్లాడేశాడు. దీంతో అనుపమతో అతడి ప్రేమాయణం గురించి వచ్చిన వార్తలన్నీ రూమర్లే అని ఫిక్సయిపోయారంతా.

కానీ ఇప్పుడు అనుపమ తన ‘ప్రేమ’ గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. తాను కూడా జీవితంలో ప్రేమ రుచి చూశానని.. కొంత కాలం ప్రేమలో ఉన్నానని అనుపమ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. నిజ జీవితంలో మీరెప్పుడైనా ప్రేమలో పడ్డారా అని ఆ ఇంటర్వ్యూలో అడిగితే.. ‘‘అవును.. ప్రేమలో పడ్డా.. కానీ అది తర్వాత బ్రేకప్ అయింది’’ అని బదులిచ్చింది అనుపమ. అంతకుమించిన తన ప్రేమ గురించి ఆమె వివరాల్లోకి వెళ్లలేదు. బుమ్రాతో లింకప్ మినహాయిస్తే.. అనుపమ ప్రేమాయణం గురించి మరే రకమైన వార్తలూ రాలేదు మీడియాలో. మరి అనుపమ ఇప్పుడు ప్రేమలో పడ్డా.. బ్రేకప్ అయింది అని అంటున్నది బుమ్రాతోనేనా.. ఆ వ్యక్తి ఇంకెవరైనానా అన్నది ఆమె సన్నిహితులకే తెలియాలి. ఇక కెరీర్ విషయానికి వస్తే.. తెలుగులో కొంచెం గ్యాప్ తర్వాత ఆమె నిఖిల్ సరసన ‘18 పేజెస్’ చేస్తోంది. అదే హీరోతో ‘కార్తికేయ-2’లోనూ నటిస్తోంది. ‘రౌడీ బాయ్స్’ పేరుతో ఆమె కథానాయికగా మరో సినిమా కూడా తెరకెక్కుతోంది.
Tags:    
  • Anupama Parameswaran 
  • Anupama Parameswaran Movies 
  • Upcoming Movies 
  • Latest Updates 
  • 18 pages 
  • nikhil 

Similar News

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

చిరు 'కాకా'.. ఈ కొడవలి వెనుక కథేంటి!

2026-11-08 07:46 GMT

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

Copyright @2026

Powered by Blink CMS