ఏయ్.. నాని హీరోయిన్ ఛాన్సు పట్టేసింది

Update: 2016-10-13 15:30 GMT
ఒక్క సినిమా హిట్టయితే చాలా వెంటనే ఆఫర్లు వాలిపోతాయ్. నాని హీరోగా రూపొందిన లేటెస్టు మూవీ ''మజ్నూ'' సినిమాలో అలరించింది మలయాళీ ముద్దుగుమ్మ అనూ ఎమ్మానుయేల్. అమెరికాలో ట్రైనింగ్ పొంది వచ్చిన ఈ హాటీ.. గ్లామర్ రోల్స్ కు కూడా రెడీయేకాని.. తెలుగులో ఇంకా ఆమె తదుపరి ఏ సినిమానూ సైన్ చేయలేదు. కాకపోతే రాజ్ తరుణ్‌ తో ఒక సినిమా.. అలాగే గోపిచంద్ ఆక్సిజన్ కు సంబంధించిన షూటింగ్ పూర్తిచేసుకుందట.

ఇక విషయానికొస్తే.. తీస్తానన్న టైముకు తీయకుండా లేటు చేసినందుకు.. విశాల్ సినిమా తుప్పరివాలన్ నుండి తప్పుకుంది రకుల్ ప్రీత్ సింగ్. ఈ సినిమాకోసం ఇప్పుడు వెంటనే పనిచేసే హీరోయిన్ ఎవరా అని వెతికిన టీమ్ కు.. అనూ ఎమ్మానుయేల్ ఓకె చెప్పేసిందట. ఈ సినిమాలో అక్షరా హాసన్ మరో హీరోయిన్ కాగా.. త్వరలోనే షూటింగ్ మొదలవ్వనుంది. అసలు విశాల్ తో సినిమా పడిందంటే.. ఖచ్చితంగా తమిళ్ అండ్ తెలుగులో పెద్ద రిలీజే ఉంటుంది. కాబట్టి అనూ ఎమ్మానుయేల్ కెరియర్ ను ఈ అవకాశం టర్నింగ్ తిప్పేయవచ్చు.

ఆల్రెడీ చేతిలో మూడు సినిమాలు ఉండటంతో ఫుల్ హ్యాపీగా ఉన్న అను.. ఇప్పుడు విశాల్ నుండి కాల్ రావడంతో ఎగిరి గెంతోస్తోంది మరి. చూద్దాం తెలుగులో తదుపరి ఎవరు అమ్మడుకు ఆఫర్ ఇస్తారో!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News