మరో ఛాలెంజింగ్‌ రోల్‌ చేస్తున్న విలక్షణ నటుడు

Update: 2020-12-07 01:30 GMT
అయిదు పదుల వయసు దాటినా కూడా నేను ఇంకా కూడా ఫిజికల్‌ గా ఏమాత్రం తగ్గలేదు అని నిపూరించేందుకు గోవా బీచ్‌ లో నగ్నంగా పరుగెత్తిన బాలీవుడ్‌ విలక్షణ నటుడు మిలింద్‌ సోమన్‌ వివాదాస్పదం అయిన విషయం తెల్సిందే. అప్పటి నుండి రెగ్యులర్‌ గా ఆయన జాతీయ మీడియాలో ఉంటూ వస్తున్నాడు. బీచ్‌ లో న్యూడ్‌ గా పరిగెత్తిన కారణంగా పోలీసు కేసును ఎదుర్కొన్న మిలింద్‌ సోమన్‌ ఇప్పుడు మరోసారి మీడియాలో నిలిచాడు. ఒక ట్రాన్స్‌ జెండర్‌ గా నటించేందుకు సిద్దం అవుతున్నట్లుగా ప్రకటించాడు.

'పౌరాష్‌ పుర్‌' అనే వెబ్‌ సిరీస్‌ లో ఈయన నటించేందుకు సిద్దం అయ్యాడు. ఈ వెబ్‌ సిరీస్‌ లో ఈయన గెటప్‌ ను రివీల్‌ చేశాడు. ముక్కుకు ముక్కు పుడక మరియు పొడవాటి జుట్టుతో పాటు నుదుట పెద్ద బొట్టుతో ఒక పవర్‌ ఫుల్‌ పాత్రలో కనిపించాడు. మొత్తానికి మిలింద్‌ సోమన్‌ మరోసారి తన ప్రతిభను ఈ సినిమాతో చూపించడం ఖాయం అనిపిస్తుంది. ఈ వెబ్‌ సిరీస్‌ లో ట్రాన్స్‌ జెండర్స్‌ గురించిన విషయాలను చెప్పబోతున్నట్లుగా తెలుస్తోంది. వీడియోను షేర్‌ చేసిన మిలింద్‌ సోమన్‌ థర్డ్‌ జెండర్స్‌ చాలా శక్తివంతులు. వారు ఈ ప్రపంచంతో పోరాటం చేస్తున్నారని పేర్కొన్నాడు.
Tags:    

Similar News