మూడు పోయినా మరో మూడు బిగ్ ఛాన్స్
చిన్న వయసులోనే సెన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న అనిరుధ్ రవిచందర్ ప్రస్తుతం కోలీవుడ్ లో సూపర్ స్టార్స్ కు మోస్ట్ వాంటెడ్. తమిళంలో ఏడాదికి అరడజనుకు తగ్గకుండా సినిమాలు చేస్తున్న అనిరుధ్ తెలుగు లో ఇప్పటి వరకు మూడు సినిమాలకు ట్యూన్స్ అందించాడు. మొదటగా పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అజ్ఞాతవాసి. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో పాటలను జనాలు పట్టించుకోలేదు. అయినా ఆ పాటలు తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా లేవని కూడా టాక్ వచ్చింది. ఆ తర్వాత జెర్సీ మరియు గ్యాంగ్ లీడర్ సినిమా లకు గాను అనిరుధ్ తో నాని వర్క్ చేశాడు.
ఆ రెండు సినిమాలు కమర్షియల్ గా నిరాశ పర్చాయి. కాని అందులోని పాటలకు పర్వాలేదు అన్నట్లుగా టాక్ వచ్చింది. సినిమా లు హిట్ కాక పోవడంతో అనిరుధ్ కు ఆఫర్లు లేవు. టాలీవుడ్ లో ఆయన చేసిన మూడు సినిమా లు కమర్షియల్ గా ప్లాప్ అవ్వడం వల్ల మళ్లీ తెలుగులో ఆయనకు ఆఫర్లు పెద్దగా రాలేదు. అదే సమయంలో కోలీవుడ్ లో వరుసగా పెద్ద హీరోల సినిమా లు చేసే అవకాశం రావడంతో టాలీవుడ్ పై ఆయన ఫోకస్ పెట్టలేదు. ఇప్పుడు ఒకే సారి మూడు బిగ్ ప్రాజెక్ట్ లు ఆయన తలుపు తడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే కన్ఫర్మ్ అయిన శంకర్ మరియు రామ్ చరణ్ ల కాంబో మూవీ కోసం నిర్మాత దిల్ రాజు సంగీత దర్శకుడిగా అనిరుధ్ కు అడ్వాన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్.. కొరటాల శివ ల కాంబోలో రూపొందబోతున్న సినిమాకు గాను ఈ యువ మ్యూజిక్ డైరెక్టర్ ను ఎంపిక చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలు మాత్రమే కాకుండా త్రివిక్రమ్ మరో సారి అనిరుధ్ కు అవకాశం ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబుతో త్రివిక్రమ్ చేస్తున్న సినిమా కు గాను ఈయన్ను మ్యూజిక్ డైరెక్టర్ గా పరిశీలిస్తున్నారట. ఒకే సారి మూడు పెద్ద ఆఫర్లు రావడంతో ఈ సంగీత దర్శకుడు ఒకటి రెండేళ్లలో టాలీవుడ్ లో మోస్ట్ బిజీ అండ్ స్టార్ మ్యూజిక్ కంపోజర్ గా నిలిచే అవకాశం ఉందంటున్నారు.