రౌడీతో ప్రయాణం ఆస్వాదిస్తున్నట్లుగా చెప్పిన బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ

Update: 2020-11-28 07:30 GMT
విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఫైటర్‌ మూవీలో బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌ గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఇప్పటికే ముంబయిలో జరిగింది. కరోనా కారణంగా బ్రేక్‌ పడింది. ముంబయిలో విజయ్‌ దేవరకొండతో చిత్రీకరణలో పాల్గొన్న సమయంలో అనన్య పాండే బాగా ఎంజాయ్‌ చేసినట్లుగా చెప్పిన విషయం తెల్సిందే. మేము ఇద్దరం కూడా చాలా బాగా కలిసి పోయాం. ఇద్దరం కలిసి వర్క్‌ చేయడంను ఆస్వాదించాం అంటూ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన అనన్య పాండే మరోసారి విజయ్‌ తో వర్క్‌ ఎక్స్‌ పీరియన్స్‌ గురించి గొప్పగా చెప్పడంతో ప్రస్తుతం అది మీడియాలో చర్చనీయాంశం అవుతోంది.

ప్రముఖ బాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. విజయ్‌ దేవరకొండ పూరి గారి కాంబోలో తాను నటిస్తున్న సినిమా షూటింగ్‌ ను ఆస్వాదిస్తున్నాను. అది ఒక విభిన్న ప్రపంచం. వారితో వర్క్‌ ఎక్స్‌ పీరియన్స్‌ చాలాబాగుంది. వారితో కలిసి పని చేస్తున్న సమయంలో చాలా విషయాలు నేర్చుకున్నాను. తెలుగులో కొన్ని మాటలను నేర్చుకున్నాను అంది. ప్రస్తుతం దీపికా పదుకునే సిద్దార్థ్‌ వంటి స్టార్స్ తో కూడా కలిసి నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందంటూ అనన్య పాండే పేర్కొంది.
Tags:    

Similar News