రజినీకాంత్ పై ధ్వజమెత్తిన దర్శకుడు
సూపర్ స్టార్ రజినీకాంత్ కు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లు అరుదు. అందులోనూ తమిళనాట అయితే ఆయన్ని అందరూ దేవుడిలాగే చూస్తారు. సినీ పరిశ్రమకు చెందిన వాళ్లు సైతం రజినీని ఒక మాట అనరు. ఐతే దర్శకుడు అమీర్ మాత్రం సూపర్ స్టార్ మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. ఐతే ఆయన విమర్శలు సహేతుకంగానే ఉన్నాయి. ఇటీవలే నరేంద్ర మోడీ 500.. 1000 నోట్లను రద్దు చేయడంపై రజినీకాంత్ స్పందించిన నేపత్యంలో ఆయన్ని టార్గెట్ చేశాడు అమీర్. నల్లధనం గురించి.. కరప్షన్ ఫ్రీ ఇండియా గురించి ఇప్పుడు మాట్లాడుతుతున్న రజినీ.. కబాలి’ సినిమా టికెట్లను వేల రూపాయలకు అమ్మినపుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించాడు అమీర్.
‘‘నల్లధనం గురించి రజినీ ఇప్పుడే ఎందుకు నోరు విప్పుతున్నారు. ఇంతకుముందు ఆయన ఏ సమస్య మీదా స్పందించింది లేదే. పెద్ద నోట్ల రద్దును మోడీ ప్రకటించిన వెంటనే కొత్త ఇండియా పుట్టిందని రజినీ అంటున్నారు. మరి పాత ఇండియాలో కబాలి అనే సినిమా రిలీజైనపుడు ఏం జరిగిందో రజినీకి తెలుసా? కబాలి ఆర్థిక వ్యవహారాల గురించి ఆయనకు తెలుసా? కబాలి టికెట్లను ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అమ్మారో లేదో ఆయనకు అవగాహన ఉందా? 120 రూపాయల కబాలి టికెట్ ను 2 వేలకు అమ్మి బ్లాక్ మనీని పోగేసుకోవడాన్ని ఆయన సమర్థిస్తారా? కబాలి బిజినెస్ గురించి ఆయన ఓపెన్ గా డిస్కస్ చేయగలరా?’’ అంటూ రజినీ మీదికి చాలా ప్రశ్నలే సంధించాడు అమీర్. మరి ఈ ప్రశ్నలపై రజినీ ఎలా స్పందిస్తాడో.. అసలు స్పందిస్తాడో లేదో చూడాలి. జాతీయ అవార్డు సాధించిన పరుత్తి వీరన్ సినిమాకు అమీరే దర్శకుడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/