• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆర్ట్ గ్యాలరీలో సరదాగా...

ఆర్ట్ గ్యాలరీలో సరదాగా సందడి చేసిన అల్లు అరవింద్!

By - Tupaki Desk
Update: 2021-11-01 09:38 GMT
అల్లు అరవింద్ ఈ వయసులోను చాలా యాక్టివ్ గా ఉంటారు. ఒక వైపున సొంత బ్యానర్ పై సినిమాలు .. నిర్మాణాలు చూసుకుంటూ ఉంటారు. అలాగే మరో వైపున తెలుగు ఓటీటీ 'ఆహా' ఉండనే ఉంది. దానికి అవసరమైన కంటెంట్ కోసం ఆయన తనవంతు ప్రయత్నాలు చేస్తూ తీరిక లేకుండా ఉంటారు. ఇక తరచూ ప్రీ రిలీజ్ ఈవెంట్లకు ఆయన హాజరవుతూనే ఉంటారు. చిన్న సినిమాలను .. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. ఇన్నిరకాల పనులను చక్కబెడుతూనే, తన అభిరుచికి తగిన ప్రదేశాల్లోను ఆయన సరదాగా మెరుస్తూ సందడి చేస్తుంటారు.

ఇక్కడ కనిపిస్తున్న ఫొటో కూడా అలాంటిదే. ఇక్కడున్న ఓ పెయింటింగ్ దగ్గర ఉన్నది అల్లు అరవింద్ .. ఆయన తనయుడు అల్లు వెంకటేశ్. ఈ ఇద్దరూ కూడా ఆదివారం సాయంత్రం హైదరాబాదులోని 'సృష్టి' ఆర్ట్ గ్యాలరీని దర్శించారు. అక్కడా జరుగుతున్న ఆన్ గోయింగ్ ప్రాజెక్టులో భాగంగా తండ్రీకొడుకులు ఈ పెయింటింగ్ ను వేశారు. ఆ సందర్భంలో దిగిన ఫొటోను అల్లు వెంకటేశ్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

ప్రస్తుతం అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ 2 కి సంబంధించిన ప్రాజెక్టులను వరుసగా పట్టాలెక్కించే పనుల్లో ఉన్నారు. ఆ సినిమాల్లో తమిళ .. మలయాళ రీమేకులు కూడా ఉన్నాయి. అలాగే 'ఆహా' ఓటీటీ కోసం రీసెంట్ గా 'అన్ స్టాపబుల్' ప్రోగ్రామ్ ను మొదలుపెట్టారు. బాలకృష్ణ వ్యాఖ్యానంలో నడిచే ఈ కార్యక్రమంపై అల్లు అరవింద్ ఎక్కువ దృష్టిపెట్టారు. ఈ కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ ను తీసుకొచ్చే దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. సబ్ స్క్రైబర్స్ ను పెంచుకోవడంలో తాము పెట్టుకున్న టార్గెట్ ను పూర్తిచేసే పనిలో ఉన్నారు.

ఇక అల్లు వెంకటేశ్ కూడా నిర్మాణ రంగం వైపే అడుగులు వేస్తున్నాడు. నిర్మాతగా తొలి ప్రయత్నంగా ఆయన 'గని' సినిమాను నిర్మిస్తున్నాడు. సిద్ధు ముద్దతో కలిసి ఆయన ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ద్వారా సయీ మంజ్రేకర్ కథానాయికగా పరిచయమవుతోంది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, జగపతిబాబు .. సునీల్ శెట్టి .. ఉపేంద్ర కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. డిసెంబర్ 3వ తేదీన ఈ సినిమను విడుదల చేయనున్నారు.


Tags:    
  • Allu Arvind 
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Mollywood 
  • news 
  • movie gossips 

Similar News

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

2026-11-20 05:07 GMT

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

'కింగ్ 100' లో చైత‌న్య అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారా?

2026-11-20 04:36 GMT

2026లోనూ టాయిలెట్..బాత్రూమ్ గురించి మాట్లాడుకునే దుస్తుతి!

2026-11-20 04:36 GMT

100 కోట్ల హీరో + 100 కోట్ల డైరెక్టర్.. ఈసారి పెద్ద టార్గెట్టే!

2026-11-20 04:16 GMT

Bigg Boss Telugu 10: డిక్టేటర్ల ఈగో వార్తో పోటెత్తిన హౌజ్!

2026-11-20 03:46 GMT

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

Copyright @2026

Powered by Blink CMS