టాప్ డైరెక్టర్లని 'అల్లు' కు పోతున్నాడు

Update: 2020-08-04 04:15 GMT
'అలవైకుంఠపురములో ' మూవీ ఇండస్ట్రీ రికార్డు కొట్టడం తో అల్లు అర్జున్ తన కెరీర్ లో ఎన్నడూ లేనంత హుషారుగా  ఉన్నాడు. 'నా పేరు సూర్య ' తర్వాత ఒక్క కథ ఎంపిక చేసుకునేందుకే ఏడాదికి పైగా సమయం తీసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం ఒకేసారి రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. అతడి  లైనప్ వావ్ అనేలా ఉంది. మన హీరోలంతా ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్ కోసం తెగ ట్రై  చేస్తున్నారు. 2004లో వచ్చిన ఆర్య అల్లు అర్జున్ కు తెలుగుతో పాటే మలయాళంలోనూ స్టార్డం తెచ్చింది. అక్కడి హీరోలకు ఏమాత్రం తగ్గకుండా అల్లు అర్జున్ సినిమాలకు కలెక్షన్లు వస్తుంటాయి.

తెలుగులో ప్లాప్ అయిన సినిమాలు కూడా అక్కడ హిట్టు కొట్టాయి. అయితే అల్లు అర్జున్ సిట్యుయేషన్ ని క్యాష్ చేసుకుని పాన్ ఇండియా ఇమేజ్ కోసం అంత సీరియస్ గా పట్టించుకోలేదు. తమిళ్ లో లింగుస్వామితో ఓ సినిమా ప్లాన్ చేసినా అది ఆగిపోయింది. ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ పెరగడం,   ఆయన ఇక వరుసబెట్టి పాన్ ఇండియా సినిమాలకే పరిమితమవడం,  ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా రాజమౌళితో 'ఆర్ఆర్ఆర్ ' చేస్తుండటం, మహేష్ తర్వాతి మూవీ రాజమౌళితో ఉండటంతో పాన్ ఇండియా ఇమేజ్ రేసులో తను వెనక పడకూడదని అల్లు అర్జున్ గట్టిగానే నిర్ణయించుకున్నట్లున్నాడు. తనకు ఎలాగూ ఇప్పట్లో రాజమౌళి దొరికే ఛాన్స్ లేదు కాబట్టి తెలుగులో ఉన్న మిగతా టాప్ డైరెక్టర్లందరినీ తన లైన్లోకే తెచ్చుకున్నాడు.

ఇప్పటికే సుకుమార్ తో ఐదు భాషల్లో 'పుష్ప' మూవీని  మొదలు పెట్టిన అల్లు అర్జున్  ఆ వెంటనే కొరటాల శివతో తన 21వ సినిమాని అనౌన్స్ చేశాడు. కొరటాల అంటేనే భారీ చిత్రాలకు పేరు. వారిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూవీని పాన్ ఇండియా కేటగిరిలోనే తీయాలని భావిస్తున్నారట. ఈ రెండు సినిమాలు పూర్తయ్యేలోగా త్రివిక్రమ్ తో మరో సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటి యంగ్ అగ్ర హీరోల్లో ఏ హీరోకు లేని విధంగా  అల్లు అర్జున్ లైనప్  సెట్ చేసుకున్నాడు. దీనిని బట్టి అల్లు అర్జున్ పాన్ ఇండియా ఇమేజ్ కోసం ఎంత పరితపిస్తున్నాడో  అర్థమవుతుంది.
Tags:    

Similar News