• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పుష్పరాజ్ లో అలాంటి...

పుష్పరాజ్ లో అలాంటి లక్షణాలు..!

By - Tupaki Desk
Update: 2021-10-14 04:38 GMT
అల్లు అర్జున్ కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు పెద్దగా ప్రయోగాల జోలికి వెళ్లలేదనే అనుకోవాలి. స్టైలింగ్ - లుక్స్ పరంగా వెరీయేషన్ చూపించాలని తపించే బన్నీ.. ఇప్పుడు 'పుష్ప' సినిమాలో సరికొత్త అవతారంలో కనిపిస్తున్నాడు. లారీ డ్రైవర్ పుష్పరాజ్ అనే ఊర మాస్ పాత్రలో కనిపించడానికి స్టైలిష్ స్టార్ చాలా కష్టపడుతున్నాడు. ఈ పాత్రకు సంబంధించిన కాస్ట్యూమ్స్ - బాడీ లాంగ్వేజ్ - భాష సహా అన్ని విషయాల్లోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. డీగ్లామరస్‌ గెటప్ లో కంప్లీట్ రగ్గుడ్ లుక్ లోకి మారిపోయాడు అల్లు అర్జున్. అంతేకాదు 'తగ్గేదే లే' అంటూ చిత్తూరు యాసను కూడా పట్టుకున్నాడు.

ఇప్పటి వరకు విడుదలైన 'పుష్ప' ప్రచార చిత్రాల్లో బన్నీ మొరటు గెటప్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అదే సమయంలో ఇందులో అంగ వైకల్యం ఉన్నవాడిలా కనిపిస్తాడా అనే సందేహాలు వ్యక్తం అయ్యేలా చేశారు. తాజాగా విడుదలైన 'శ్రీవల్లి' పాటలో బన్నీ వేసిన స్టెప్ ఒకటి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఇందులో బన్నీ బాడీ లాంగ్వేజ్‌ కొంచెం చిత్రంగావుంది. పుష్పరాజ్ ఒక భుజాన్ని కొంచెం పైకి లేపి డ్యాన్సులు చేయడం గమనించవచ్చు. దీనిని బట్టి చూస్తే అతను వైకల్య లక్షణాలున్న వ్యక్తిగా కనిపించబోతున్నాడనిపిస్తోంది.

'పుష్ప' టీజర్ మరియు 'దాక్కో దాక్కో మేక' సాంగ్ లో కూడా అల్లు అర్జున్ తన భుజాన్ని కొంచెం పైకెత్తి ఉంచడం కనిపించింది. 'తగ్గేదే లే' అంటూ హీరో గడ్డం సవరించుకోడానికి దాన్నొక మేనరిజంలా చూపిస్తున్నారా... లేక పుష్పరాజ్ కు నిజంగానే ఏదైనా వైకల్యం ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. సుకుమార్ ఇంతకుముందు 'రంగస్థలం' సినిమాలో రామ్ చరణ్ ను చెవిటివాడిగా చూపించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో అల్లు అర్జున్ తో కూడా వవిభిన్నమైన పాత్రను చేయిస్తున్నారు.

ఇప్పటి వరకు బయటకు వచ్చిన 'పుష్ప' ప్రమోషనల్ కంటెంట్ ని చూసి ఈసారి బన్నీ పెర్ఫార్మన్స్ ని అవార్డులు గ్యారంటీ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ఆయన కెరీర్ లోనే గుర్తుండిపోయే క్యారక్టర్ అవుతుందని నమ్ముతున్నారు. మరి సిల్వర్ స్క్రీన్ మీద పుష్పరాజ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. కాగా, ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో  ఈ సినిమా తెరకెక్కుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రెండు భాగాలుగా రానుంది. ఫస్ట్ పార్ట్ ని ''పుష్ప: ది రైజ్'' పేరుతో డిసెంబర్ 17న రిలీజ్ చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. ఫాహాద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.
Tags:    
  • PushpaTheRise 
  • PushpaTheRiseOnDec17 
  • Srivalli 
  • Allu Arjun 
  • Rashmika 
  • Sid Sriram 
  • Sukumar 
  • DSP 
  • Pushpa 

Similar News

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

చిరు 'కాకా'.. ఈ కొడవలి వెనుక కథేంటి!

2026-11-08 07:46 GMT

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

Copyright @2026

Powered by Blink CMS