బాహుబలి కోసం అందరూ కలసిపోయారు
ఒకప్పుడు ఫ్యాన్స్ వేరు! ఇప్పటి ఫ్యాన్స్ వేరు!! అభిమానుల్లో బోలెడంత మార్పు వచ్చేసింది. అభిమానంలో చాలా తేడా తెలుస్తోంది. మునుపటి కంటే చదువు, సంస్కారం పెరిగి విజ్ఞానవంతులు ఎక్కువవుతున్నారు కాబట్టి .. కేవలం తాము అరాధించే హీరోనే కాకుండా ఇతర హీరోల విషయంలోనూ సంయమనం పాటిస్తున్నారు. అంతేకాదు ఒకరికొకరు కొట్టుకోకుండా సహకారం అందించుకుంటున్నారు.
పవన్ అభిమానులు మహేష్‌కి సపోర్ట్ ఇస్తున్న వైనం చూస్తున్నాం. మహేష్ అభిమానులు పవన్‌కి సపోర్టుగా ఉంటున్న వైనాన్ని చూశాం. ఇప్పుడు అదే తీరుగా పవన్ అభిమానులు బాహుబలికి సపోర్ట్ ఇస్తున్నారు. ప్రభాస్‌ని తమ హీరోగా భావించి ప్రమోట్ చేస్తున్నారు. అంతేనా మరోవైపు ఎన్టీఆర్ అభిమానులు సైతం ప్రభాస్‌కి బోలెడంత సపోర్ట్ ఇస్తున్నారు. బాహుబలి పోస్టర్లపై ఏకంగా తమ అభిమాన హీరోల ఫోటోలు వేసి మేమంతా ఒక్కటే అన్న సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఆ పోస్టర్లు చూస్తుంటే జనాలకు ముచ్చటేస్తోంది. 220 బ్యాచ్, పవర్ సర్కిల్, గొల్లపూడి అన్న ట్యాగ్‌లైన్‌తో ఓ భారీ కటౌట్‌ని పెట్టారు అభిమానులు. ఇందులో ప్రభాస్‌తో పాటు పవన్ కూడా దర్శనమిచ్చాడు. మొత్తానికి ఫ్యాన్స్‌లో ఇది అనూహ్య మార్పు. కాలంతో పాటే వచ్చిన మార్పు. వెల్‌కమ్ మైడియర్ ఫ్యాన్స్.