క్లిక్ క్లిక్‌ : కూల్చివేస్తున్న కృష్ణరాజ్‌ బంగ్లాకు వెళ్లిన సీత

Update: 2021-08-04 16:30 GMT
తెలుగు ప్రేక్షకుల ముందుకు త్వరలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో సీత పాత్ర పోషిస్తూ రామ్‌ చరణ్‌ కు జోడీగా ఆలియా భట్‌ రాబోతుంది. అల్లూరి సీతారామ రాజు పాత్రకు మరదలి పాత్ర సీత గా ఈమె కనిపించబోతున్నారు. ఇటీవలే ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా చిత్రీకరణ ను ముగించినట్లుగా చెప్పుకొచ్చారు. తాజాగా ఆలియా భట్‌ ముంబయిలోని పలి హిల్స్ లో ఉండే కృష్ణరాజ్‌ బంగ్లాకు వెళ్లింది. ప్రస్తుతం ఆ బంగ్లాను కూల్చి వేస్తున్నారు. ఆ బంగ్లా కూల్చి వేస్తున్న నేపథ్యంలో ఒక సారి చూడ్డానికి అంటూ నీతూ కపూర్‌ తో కలిసి ఆమె వెళ్లింది.

గత ఏడాది చనిపోయిన రిషి కపూర్‌ కుటుంబం సుదీర్ఘ కాలం పాటు కృష్ణరాజ్‌ బంగ్లాలో ఉండేవారు. భార్య నీతూ కపూర్ మరియు ఇద్దరు పిల్లలు అయిన రణబీర్‌ కపూర్‌ ఇంకా రిద్దిమా కపూర్ లు ఆ బంగ్లాలోనే పుట్టి పెరిగారు. 35 ఏళ్ల పాటు రిషి కపూర్‌ ఫ్యామిలీ ఆ బంగ్లాలో ఉన్నారు. 1980 లో రిషి కపూర్‌ ఆ భవనంను కొనుగోలు చేశాడు. అప్పటి నుండి దాన్ని సెంటిమెంట్‌ గా ఉంచుకుంటూ వచ్చాడు. ఆయన మరణంకు ముందే ఆ భవనంను తొలగించే చర్చలు జరిగాయి. ఇటీవల ఆ భవనంను తొలగించేందుకు సిద్దం అయ్యారు.

కృష్ణరాజ్‌ భవనం కూల్చి వేసి 15 అంతస్తుల భారం అపార్ట్‌మెంట్‌ ను నిర్మిస్తున్నారు. కూల్చి వేస్తున్న భవనంను ఎందుకు ఆలియా చూసేందుకు వెళ్లింది అనేది చాలా మంది కామెంట్స్.. ఆ విషయంమై కొందరు అభిప్రాయం ఏంటీ అంటే ప్రస్తుతం రణబీర్‌ కపూర్‌ మరియు ఆలియా భట్ లు ప్రేమలో ఉన్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. తన కాబోయే భర్త ఇంటిని.. ఆయన చిన్నప్పుడు గడిపిన ఇంటిని చూసేందుకు ఆలియా ఆసక్తి చూపించిందని.. అందుకే అత్తవారు నీతూ కపూర్‌ స్వయంగా వెంట బెట్టుకుని పాత ఇంటిని చూపించారంటూ నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి.
Tags:    

Similar News