#AHA ఒకే ఒక్క మెగాస్టార్.. మెగాభిమానుల‌కు సారీ..

Update: 2020-12-31 08:15 GMT
బాస్ అల్లు అర‌వింద్ త‌ర‌పున `ఆహా` బృందాలు మెగాభిమానుల‌కు సారీ చెప్ప‌డం తాజాగా పెద్ద‌ సంచ‌ల‌న‌మే అయ్యింది. ``ఒకే ఒక్క మెగాస్టార్.. జ‌రిగిన త‌ప్పున‌కు మెగాభిమానుల‌కు సారీ.. `` అంటూ ఆహా వాళ్లు సారీ చెప్పారంటే దానికి కార‌ణం ఏమై ఉంటుంది? అన్న ఉత్సుక‌త అంద‌రిలోనూ ఉంటుంది. అయితే అందుకు స‌హేతుక కార‌ణం లేక‌పోలేదు.

అస‌లు స్టైలిష్ స్టార్ అని ఉండాల్సిన చోట మెగాస్టార్ అని త‌ప్పుగా టైప్ చేస్తే దానికి మూల్యం ఎలా చెల్లించుకోవాల్సి ఉంటుందో అల్లు కాంపౌండ్ కే కాదు ఎవ‌రికైనా స్ప‌ష్ఠంగా తెలిసిన విష‌య‌మే. అందుకే `ఆహా` లో టెక్నిక‌ల్ ఎర్ర‌ర్ అంటూ వివ‌ర‌ణ ఇచ్చి ఫైరింగులో ఉన్న మెగాభిమానుల‌ను చ‌ల్ల‌బ‌రిచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.
 
ఇంత‌కీ ఏం జ‌రిగింది? అన్న‌ది వివ‌రంగా ప‌రిశీలిస్తే.. `సామ్ జామ్` తాజా ఎపిసోడ్ ను ప్రమోట్ చేస్తున్నప్పుడు ఆహా OTT అనువర్తనం వారి యూట్యూబ్ ప్రకటనలలో అల్లు అర్జున్ ను `మెగాస్టార్` అని సంబోధించి షాకిచ్చారు.`ఆహా` వేదిక ప్ర‌మోష‌న్ లో `మెగాస్టార్ అల్లు అర్జున్` అని టైటిల్ పెట్టడంతో మెగాస్టార్ అనుయాయులు అభిమానులు.. అల్లు అర్జున్- అల్లు అరవింద్ ల‌ను పెద్ద ఎత్తున ట్రోల్ చేయడం ప్రారంభించారు.

చిరంజీవి లేదా అల్లు అర్జున్ పేరును ప్ర‌స్థావించాల్సిన ప‌నే లేకుండా అసలు జరిగిన విషయం గురించి మాట్లాడకుండా.. ఎంతో తెలివిగా అహా అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ లో క్షమాపణలు పోస్ట్ చేశారు. అనాలోచిత లోపం అంటూ `ఆహా` క్షమాపణ చెప్పింది. ``ఒకే ఒక్క‌ మెగాస్టార్ .. మనందరికీ ఇది తెలుసు`` అని వ్యాఖ్య‌ను జోడించి వివాదానికి చెక్ పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. ఇది బ‌న్ని.. అర‌వింద్ ల‌ను టార్గెట్ చేస్తున్న వారంద‌రిలో హీట్ త‌గ్గిస్తుందా? అన్న‌ది కాస్త ఆగితే కానీ తేల‌దు.
Tags:    

Similar News