సెకండ్ డే కలెక్షన్స్: 'ఇబ్బందుల'వాసి

Update: 2018-01-12 09:58 GMT
తొలిరోజున 40 కోట్ల షేర్. రెండో రోజున 5 కోట్ల షేర్. అంతకంటే ఒక్క సింగిల్ మాట కూడా అక్కర్లేదు.. ఈ 'అజ్ఞాతవాసి' ఇబ్బందుల్లో పడి ఇబ్బందులవాసి అయిపోయిందని చెప్పడానికి.

ఎన్నో అంచనాల నడుమన విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా దారుణమైన రిజల్ట్ ని అందుకుంది. సినిమా గురించి అటు ఆడియెన్స్ లో గాని ఇటు సినిమా ప్రముఖుల నుంచి గాని పాజిటివ్ టాక్ ను అందుకోలేదు. త్రివిక్రమ్ పవన్ కాంబినేషన్ అనడంతో సినిమా కలెక్షన్స్ మొదటి వారం ఓ రేంజ్ లో ఉంటాయని అంతా అనుకున్నారు. అయితే మొదటి రోజు అనుకున్నట్టుగానే మంచి వసూళ్లనే రాబట్టిన అజ్ఞాతవాసి సెకండ్ డే మాత్రం మినిమమ్ వసూళ్లను కూడా రాబట్టలేదు. ఆ విధంగా సినిమా ఫేట్ ఇబ్బందుల్లో పడిపోయింది.

ఊహించినట్టుగానే మొదట వరల్డ్ వైడ్ గా రూ.60 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్స్ దాటాయి. కానీ మొదటి రోజు టాక్ మాత్రం పూర్తిగా నెగిటివ్ గా రావడంతో ఇప్పుడు సంక్రాంతి కి కూడా నష్టాలూ తప్పవు అనే అనుమానం కలుగుతోంది. రెండవరోజు కేవలం రూ.10 కోట్లు గ్రాస్ మాత్రమే దక్కింది. మొదటికి రోజు వచ్చిన షేర్లను చూస్తే రెండవరోజుకు 80 శాతం తక్కువగా వచ్చాయి. మొత్తంగా రెండు రోజులకి కలిపి 70కోట్ల గ్రాస్ తో సరిపెట్టుకొంది.  ఇక యూఎస్ లో రెండు రోజులకు కలిపి 1.72M డాలర్లు దక్కాయి. ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంది.

మొత్తంగా ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.   

నైజాం - 7,32,00,000

సెడెడ్ - 3,90,00,000

నెల్లూరు - 1,75,00,000

గుంటూరు - 4,06,12,971

కృష్ణ - 2,14,66,117

వెస్ట్ - 3,82,61,965

ఈస్ట్ - 3,04,19,415

ఉత్తరాంధ్ర - 4,20,00,000

మొత్తం 2 రోజులు ఏపీ & తెలంగాణ  - 30.24 Cr (గ్రాస్ - 45 Cr)

మొత్తం 2 రోజులు ప్రపంచవ్యాప్తంగా  - 45 Cr (గ్రాస్ - 70 Cr)

Disclaimer: Figures mentioned here have been collected from few sources and also include estimates. Authenticity can't be guaranteed...!
Tags:    

Similar News