చెప్పుతో కొట్టిందని, నటి సామాను రోడ్డుపై, అర్దరాత్రి రచ్చ
కొందరితో వివాదాలు,కష్టాలు రెండు కలిసి ప్రయాణం చేస్తూంటాయి. ఎప్పుడూ ఏదో వివాదంతో మీడియాలో నలుగుతూంటే నటి విజయలక్ష్మి మరోసారి మీడియాకు ఎక్కింది. ఈ సారి ఆమె చిక్కుకున్న వివాదం చూస్తే జాలిపడాలా...బాధపడాలో అర్దం కాని పరిస్దితి. ఆమె అద్దె చెల్లించలేదంటూ ప్లాట్ మేనేజర్ ఆమె సామాన్లు బయట పడేశాడు. దాందో ఆమె కాస్త హడావిడి చేసింది. చివరకు పోలీస్ లు సీన్ లోకి రావాల్సి వచ్చింది.
చెన్నై టీనగర్ హబీబుల్లా రోడ్డులోని ఓ సర్వీసు అపార్ట్‌మెంట్‌లో విజయలక్ష్మి, ఆమె సోదరి కలిసి ఉన్నారు. అయితే ఆమె సోదరి అనారోగ్యం పాలు కావడంతో కొద్ది రోజులుగా ఆస్పత్రిలో ఉన్నారు. శనివారం రాత్రి డిశ్చార్జ్ కావడంతో ఇంటికి వచ్చేసరికి ఆమె ప్లాట్ లో వేరే వారు ఉంటున్నారు. దాంతో ఈ ఊహించని పరిణామానికి ఆమెకు షాక్ తప్పలేదు. తమ ప్లాట్ లో మరో వ్యక్తి ఉండడంతో వెంటనే ప్లాట్ మేనేజర్ విఘ్నేశ్వరన్‌ను సంప్రదించారు. మూడు నెలలుగా అద్దె చెల్లించని దృష్ట్యా సామన్లు మరో గదిలో పెట్టినట్టు చెప్పారు. సాధారణంగా ఇలాంటి సిట్యువేషన్ లో ఎవరైనా అక్కడి వారితో మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటారు. కానీ విజయలక్ష్మి, మీడియాకు సమాచారం అందించారు.
మీడియావారు రాగానే తన సోదరికి ఒంట్లో బాగోలేదని హాస్పటిల్ లో ఉండివచ్చేసరికి..ఇలా సామాన్లు బయట పడేశారని, తను రోడ్డున పడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఈ ప్లాట్ లో రాజకీయ నేత హరినాడర్ అన్నయ్య తీసుకొచ్చి ఉంచారని, ఆయన్ను సంప్రదించకుండా తనను రోడ్డున పడేశారని కన్నీళ్లు పెట్టుకున్నారు. దాంతో అదంతా మీడియా వారు ప్రసారం చేసారు. ఈ లోగా మీడియావారు...అసలు ఎందుకిలా చేసారని ప్లాట్ మేనేజర్ విఘ్నేశ్వరన్ ని అడిగారు.
అయితే తామేమీ ఆమె సామాన్లు బయట పడేయలేదని, వాటిని ఓ గదిలో పెట్టామని, తమ ప్లాట్ స్టాఫ్ శివాను చెప్పుతో కొట్టడంతోనే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మేనేజర్ విఘ్నేశ్వరన్ పేర్కొన్నారు.అలాగే హరినాడర్‌కు ఈ ప్లాట్‌కు సంబంధం లేదని, ఆమెను జావెద్ అనే వ్యక్తి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడని పేర్కొన్నారు. ఇలా ఆమె చెప్పే మాటలకు, వాళ్లు చేసే వాదనకు సంభందం లేకుండా పోయింది.
అర్ధరాత్రి వేళ ఈ హడావిడి ఎవరికీ అర్దం కాలేదు. తన శత్రువైన నామ్ తమిళర్ కట్చి నేత, నటుడు, దర్శకుడు సీమాన్ ని ఉద్దేశించి.. నువ్వయినా ఆదుకో అంటూ విజయలక్ష్మి కన్నీటి పర్యంతం అయ్యింది. ఈ లోగా పోలీసులు రంగంలోకి దిగారు. తేనాంపేట పోలీసులు విచారించి విజయలక్ష్మికి తాత్కాలిక ప్రత్యామ్నాయం కల్పించారు. గతంలో సీమాన్ తనను మోసం చేశారంటూ గతంలో నటి విజయలక్ష్మి తీవ్ర ఆరోపణలు చేసింది. ఆత్మహత్యాయత్నాలు చేసింది. ఏదైమైనా అర్దరాత్రి ఈ వ్యవహారం ఈ చుట్టుప్రక్కల వాళ్ళని కంగారుపెట్టింది.
Full View