ఫోటో స్టొరీ: బికినీలో ఖజురహో శిల్పం

Update: 2019-05-13 09:07 GMT
ఫోటోస్టొరీలోకి వెళ్ళేముందు బ్యూటీ బయోడేటా తెలియాలిగా?  భామ పేరు శాన్వి శ్రీవాస్తవ.  పుట్టింది వారణాశి అయినా మనం బెంగుళూరు భామ అని ఫిక్స్ అయిపోవచ్చు ఎందుకంటే మకాం బెంగుళూరులోనే.. కన్నడ సినిమాలు ఎడాపెడా చేసి శాండల్ వుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా అని తెలుగులో సినిమాలు చేయలేదని అనుకుంటారేమో. కాదు కాదు.  'లవ్లీ'.. 'అడ్డా'.. 'రౌడీ'.. 'ప్యార్ మే పడిపోయానే'.. ఇవి ఈ పాప టాలీవుడ్ సినిమాల లిస్టు.  

అంతే కాదు ఈ శాన్వికి ఒక అక్క ఉంది పేరు విదిశ.  ఆ భామ కూడా హీరోయినే. అల్లరి నరేష్ సినిమా 'అత్తిలి సత్తిబాబు' లో హీరోయిన్ గా నటించింది. ఇక ఇంట్రో చాలు. శాన్వి సోషల్ మీడియా విషయానికి వస్తే యమా ఫాస్ట్ అమ్మాయి కాబట్టి హాటు ఫోటోలు.. అప్డేట్లు కూడా ఆ రేంజ్ కి తగ్గట్టే ఉంటాయి. తాజాగా ఒక బికినీ ఫోటో పోస్ట్ చేసింది.  ఒక గోడకు ఆనుకొని నిలబడి తన అందాల వ్యూకు అడ్డురాకుండా ఒక కోటు లాంటి దాన్ని ఊరికే అలా పట్టుకుంది. పోజు మామూలుగా లేదు.  ఖజురహో శిల్పానికి బికినీ వేసి నిలబెట్టినట్టుగా ఉంది.

ఇక ఈ ఫోటోకు శాన్వి ఇచ్చిన క్యాప్షన్ కట్ షార్ట్ గా చెప్పుకుంటే "ఈ ప్రొఫెషన్ లో బోల్డ్ గా ఉండడం అవసరమా అని అడుగుతూ ఉంటారు. కానీ ప్రశ్న అలా ఉండకూడదు. వెర్సాటైల్ గ ఉండడం అవసరమా అని అడగాలి. యాక్టింగ్ అంటే ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోవడం.. అందుకే నేను విభిన్నంగా ఉండదలుచుకున్నాను.  ఎందుకంటే రెక్కలను సగమే తెరిచి ఎగరలేం కదా?".  ఇదేదో డీప్ ఫిలాసఫీ లా ఉంది.  వర్మ లాంటి మేథావులకు తప్ప మామూలు జనాలకు అర్థం అయ్యేలా లేదు. కాబట్టి అర్థం అయినోళ్ళు సరే.. అర్థం కాకపోతే వదిలేయండి.  ఈ ఫిలాసఫీ సంగతేమో కానీ ఫోటో మాత్రం అందరికీ చక్కగా అర్థం అయింది. అందుకే హాట్ గా ఉన్నావని ఒకరు.. స్టన్నింగ్ బ్యూటీ అని మరొకరు.. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అని ఇంకొకరు కామెంట్స్ పెట్టారు.  అందుకేగా సింపుల్ థింగ్స్ ఆర్ బ్యూటిఫుల్ అనేది! 
Tags:    

Similar News