ఇప్పటికైనా తెలుగు 'లూసీఫర్‌' గాడిన పడేనా?

Update: 2020-11-12 05:15 GMT
మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ నటించిన లూసీఫర్‌ ను తెలుగులో రీమేక్‌ చేయాలని చిరంజీవి ఆశ పడ్డాడు. అయితే ఆ కథను కమర్షియల్‌ గా మార్చడానికి నానా తంటాలు పడుతున్నారు. మొదట సాహో దర్శకుడు సుజీత్‌ కు ఆ బాధ్యతలు అప్పగించగా ఆయన నిరాశ పర్చాడు. ఆ తర్వాత వివి వినాయక్‌ చెంతకు ఆ రీమేక్‌ బాధ్యతలు వెళ్లాయి. దాదాపు మూడు నెలల పాటు వినాయక్‌ ప్రముఖ రచయితలతో కలిసి రీమేక్‌ కోసం కథను రెడీ చేశాడు. వినాయక్‌ రెడీ చేసిన కథ కూడా మెగా కాంపౌండ్‌ ను నిరాశ పర్చినట్లుగా వార్తలు వచ్చాయి. చివరి ప్రయత్నంగా ఆ బాధ్యతలను పరుచూరి బ్రదర్స్‌ కు అప్పగించినట్లుగా తెలుస్తోంది.

చిరంజీవి కమర్షియల్‌ గా బిగ్గెస్ట్‌ సక్సెస్‌ లు దక్కించుకున్న పలు సినిమా రచనా బాధ్యతలు పరుచూరి బ్రదర్స్‌ నిర్వర్తించారు. సీనియర్‌ హీరోల స్టామినాకు తగ్గట్లుగా.. వారి కమర్షియల్‌ పొటెన్షియల్‌ కు అనుగుణంగా స్క్రిప్ట్‌ ను రెడీ చేయడంలో వీరు దిట్ట. అందుకే లూసీఫర్‌ రీమేక్‌ స్క్రిప్ట్‌ బాధ్యతలను వీరిద్దకు తీసుకు వచ్చారు. ఒరిజినల్‌ లూసీఫర్‌ లో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉండవు.. దానికి తోడు తెలుగు రీమేక్‌ లో హీరోయిన్‌ పాత్రను జొప్పించాలని భావిస్తున్నారు.

కమర్షియల్‌ గా స్ర్కిప్ట్‌ ను తయారు చేయడంలో పరుచూరి వారు ఖచ్చితంగా సక్సెస్‌ అవుతారు అనే నమ్మకం అందరిలో వ్యక్తం అవుతుంది. అందుకే లూసీఫర్‌ రీమేక్‌ ఇప్పటికి గాడిలో పడ్డట్లే అంటున్నారు. చిరు మొదట ఆచార్య సినిమాను ఆ తర్వాత వేదాళం సినిమాను చేయబోతున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్‌ లో లూసీఫర్‌ రీమేక్‌ లో నటించే అవకాశాలు ఉన్నాయి. అది కూడా స్క్రిప్ట్‌ విషయంలో సంతృప్తి చెందితే.
Tags:    

Similar News