తెలుగు స్టార్లూ.. ఖాన్ చెప్పేది విన్నారా
బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కు మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ గా పేరుంది. స్క్రిప్టు నచ్చితే తప్ప సినిమా చెయ్యడు. అతడి ఖాతాలో హిట్లు.. బ్లాక్ బస్టర్లే ఎక్కువ. అమీర్ ఖాన్ సినిమా చేస్తానూ అంటే అతడు అడిగినన్ని కోట్లు ఇవ్వడానికి నిర్మాతలు క్యూలో నుంచుంటారు. అలాంటప్పుడు మూవీ చేయడానికి ముందుగా అమీర్ తీసుకునే అడ్వాన్స్ ఎంత.. అసలు రెమ్యునరేషన్ ఎంత అనే సందేహం కలగక మానదు.
దీనికి అమీర్ ఖానే స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. తాను సినిమా చేయడానికి ముందు రెమ్యునరేషన్ తీసుకోవడం ఎప్పుడో మానేశానని చెప్పుకొచ్చాడు. బాక్సాఫీస్ వద్ద మూవీ ఎంతమేరకు కలెక్షన్లు వసూలు చేసిందో దానిని బట్టే తాను తీసుకునే మొత్తం ఉంటుందన్నాడు. అంటే సినిమా కలెక్షన్లు కురిపిస్తే అమీర్ కు భారీ మొత్తం లభిస్తుంది. ఒకవేళ అదృష్టం బాగోలేక ఫ్లాపయితే హీరోకు ఇచ్చే మొత్తమూ తగ్గుతుంది. టాలీవుడ్ లో పెద్ద స్టార్లయిన మహేష్. వవన్ కళ్యాణ్ .. అల్లు అర్జున్.. ఇలా దాదాపుగా అందరూ సినిమా స్టార్ట్ చేయడానికి ముందే వాళ్ల రెమ్యునరేషన్ మొత్తం వసూలు చేసుకుంటారు. ఆ తరవాతే సెట్లో అడుగుపెడతారు.
ఒకవేళ నిర్మాణంలో తేడాకొట్టి సినిమా ఫ్లాపయితే హీరోలకు వచ్చే నష్టం ఏముండదు. కానీ ప్రొడ్యూసర్ పూర్తిగా బుక్కయిపోతాడు. పెద్ద హీరోలతో సినిమా తీయడానికి అయ్యే ప్రొడక్షన్ కాస్ట్ లో హీరోల రెమ్యునరేషన్ కే ఎక్కువ మొత్తం అవుతోంది. అదేదో అమీర్ ఖాన్ రూట్లో వెళితే నిర్మాత కాస్త ఒడ్డున పడతాడు.. హీరోలకూ సినిమా విషయంలో రెస్పాన్సిబులిటీ పెరుగుతుంది.సినిమా హిట్టయిందో హీరోకు డబుల్ బెనిఫిట్. అందుకని హీరోలూ.. కాస్త అమీర్ మాట ఏదో ఆలకిద్దురూ.