• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  #AA20 2020లో కష్టమేనా...?

#AA20 2020లో కష్టమేనా...?

By - Tupaki Desk
Update: 2020-03-26 13:00 GMT
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో 21 రోజులు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలో కరోనా బారినపడ్డ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ పోతుంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు 500 దాటిపోయాయి. కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 10కి చేరింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ రోగుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ పోవడం దిగ్బ్రాంతి కలిగిస్తుంది. ఇక కరోనా దెబ్బకు సినిమా ఇండస్ట్రీ కూడా లాక్ డౌన్‌లోకి వెళ్లింది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలు షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి, అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో చిత్ర పరిశ్రమ భారీగా నష్టపోగా సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకు కొత్త చిత్రాల విడుదల, షూటింగ్స్ షురూ చేసే అవకాశం కూడా లేదు.

మన టాలీవుడ్ లో అనేక భారీ మరియు చిన్న చిత్రాల షూటింగ్ బ్రేక్ పడింది. వీటిలో అల్లు అర్జున్ మూవీ ఒకటి. సుకుమార్ - బన్నీ కాంబినేషన్ లో ఓ మాస్ అండ్ యాక్షన్ ఎంటెర్టైనర్ తెరకెక్కుతుండగా ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ కేరళలో ప్లాన్ చేశారు. దేశంలో కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాలలో కేరళ ఒకటి కావడం తో అక్కడ షూటింగ్ చేసే ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పట్లో సాధారణ పరిస్థితి నెలకొని షూటింగ్ మొదలుపెట్టే పరిస్థితులు కనిపించడం లేదు. దీనితో బన్నీ-సుకుమార్ ల మూవీ 2020లో రావడం కష్టమే అంటున్నారు. అతని స్టైల్లో చెప్పాలంటే బన్నీకి మళ్ళీ గ్యాప్ రావడం ఖాయం అని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. కాగా, ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వాళ్ళు నిర్మిస్తున్నారు. రష్మిక, విజయసేతుపతి ప్రధాన పాత్రలు పోషిస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నారు.
Tags:    
  • Tollywood News 
  • Bollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • allu arjun 
  • sukumar 
  • AA20 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS