బిగ్ బాస్ అగ్నిపరీక్ష జడ్జెస్ పై నా అన్వేషణ ఫైర్.. నాగార్జునను కూడా?
నా అన్వేషణ, ప్రపంచ యాత్రికుడు వంటి యూట్యూబ్ ఛానల్స్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నా అన్వేషణ అన్వేష్ (Naa Anveshana anvesh) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
నా అన్వేషణ, ప్రపంచ యాత్రికుడు వంటి యూట్యూబ్ ఛానల్స్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నా అన్వేషణ అన్వేష్ (Naa Anveshana anvesh) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా సమాజంలో జరిగే పలు అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ వార్తల్లో నిలిచే ఈయన.. డ్రగ్స్ విషయంలో , బెట్టింగ్ యాప్ విషయంలో ఇరుక్కున్న సెలబ్రిటీలను, యూట్యూబర్స్ ను టార్గెట్గా చేసుకొని సోషల్ మీడియా ద్వారా చేసిన వీడియోలు సంచలనం సృష్టించాయి. ఇండియాపై చేసిన కామెంట్లకు కూడా చాలామంది మండిపడ్డారు. అంతేకాదు అన్వేష్ ను ఇండియా నుండి బహిష్కరించాలి అనే రేంజ్ లో కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.పైగా అన్వేష్ పై పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదయ్యాయి.
అలాంటి వాళ్లని జడ్జెస్ గా నియమిస్తారా?
ఇలాంటి ఘటనల తర్వాత మళ్లీ అన్వేష్ ఎక్కడా కనిపించలేదు. అయితే ఇప్పుడు తాజాగా బిగ్ బాస్ అగ్నిపరీక్ష జడ్జెస్ పై, అలాగే నాగార్జునపై తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. నా అన్వేషణ అన్వేష్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఒక వీడియో విడుదల చేస్తూ.. ఇటీవలే అగ్నిపరీక్ష అంటూ రెండు రీల్స్ చూశాను . అసలు వాళ్లను జడ్జెస్ అంటారా.. నవదీప్ ను తీసుకొచ్చి జడ్జిగా కూర్చోబెట్టారు. అతడు ఎలాంటి వాడో అందరికీ తెలిసిందే. ఇక బిందు మాధవి.. ఆమె హీరోయిన్ అనే సంగతి ఎవరికీ తెలియదు. అసలు ఆమె ఏ సినిమాలో హీరోయిన్గా చేసింది. అభిజిత్ హీరోగా ఏ సినిమాలలో నటించారు. ఇలాంటి వాళ్లను అగ్నిపరీక్షలో జడ్జెస్ గా ఎలా నియమిస్తారు అంటూ హోస్ట్ నాగార్జునను నిలదీశారు.
గొప్పవాళ్లే ఆణిముత్యాలను తయారు చేస్తారు..
జడ్జెస్ కింద ఐపిఎస్ సజ్జనార్, ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ్ లేదా టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి లేదంటే వీరి స్థాయిలో ఉన్న సెలెబ్రిటీలను జడ్జెస్ గా పెట్టొచ్చు కదా.. ముఖ్యంగా 70 ఏళ్ల బ్రహ్మానందం గారిని జడ్జిగా నియమించొచ్చు కదా.. అలాంటి వాళ్లను జడ్జెస్ స్థానంలో కూర్చోబెడితే సమాజానికి ఆణిముత్యాలు , వజ్రాలు లాంటి వారిని బయటకు తీసుకొస్తారు. కానీ ఇలాంటి వారిని జడ్జెస్ గా కూర్చోబెట్టడం వల్ల.. ఏం ఉపయోగం అంటూ తనదైన శైలిలో మండిపడ్డారు.
సమాజానికి ఏం ఉపయోగం?
ఒక మీ స్కూల్ నుంచే 50 మందికి పైగా ఇలాంటి చెత్త వాళ్ళు బయటకు వచ్చారు. రైతు రైతు అంటూ చెప్పుకున్న పల్లవి ప్రశాంత్ ముందుగా మిమ్మల్ని వెర్రిపప్పని చేశాడు. ఆ తర్వాత సమాజాన్ని చేసాడు. ఇలాంటి వాళ్ల వల్ల సమాజానికి ఏం ఉపయోగం అంటూ తనదైన శైలిలో స్పందించారు. మొత్తానికైతే నా అన్వేషణ అన్వేష్ నాగార్జున పై అలాగే అగ్నిపరీక్ష జడ్జెస్ పై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.