• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అనుష్క - క్రిష్.. రియల్...

అనుష్క - క్రిష్.. రియల్ స్టోరీ?

| రీసెంట్ గా అయితే దర్శకుడు అనుష్కతో కొత్త ప్రాజెక్టును మొదలు పెట్టబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ గట్టిగా వైరల్ అయింది.

By - Tupaki Desk
Update: 2024-02-14 02:30 GMT

దర్శకుడు క్రిష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరపైకి తీసుకురావడానికి గత ఏడాది వరకు గట్టిగానే ప్రయత్నాలు చేశాడు కానీ వివిధ కారణాల వలనఈ సినిమా ప్రాజెక్టుకు చాలా సార్లు బ్రేకులు పడ్డాయి. ఒకవైపు పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండడం అలాగే మరొకవైపు స్క్రిప్ట్ విషయంలో మార్పులు కోరడం వలన ప్రాజెక్టు వాయిదా పడుతూ వచ్చింది.

రీసెంట్ గా అయితే దర్శకుడు అనుష్కతో కొత్త ప్రాజెక్టును మొదలు పెట్టబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ గట్టిగా వైరల్ అయింది. ఎలాంటి హడావిడి లేకుండా ఈ సినిమా పనులలో వేగం పెంచుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే హరిహర వీరమల్లో ఆగిపోయిందా అనే ప్రచారాలకు నిర్మాత ఇటీవల క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు కొనసాగుతున్నట్లుగా చెప్పారు.

ఇక మరొకవైపు క్రిష్ అనుష్క ప్రాజెక్టుకు సంబంధించిన రకరకాల కథనాలు కూడా వైరల్ గా మారుతూ ఉన్నాయి. సాధారణంగా క్రిష్ తన ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక కొత్త తరహా కాన్సెప్ట్ ను మంచి సందేశంతో తెరపైకి తీసుకువస్తూ ఉంటాడు. ఇక అనుష్కతో చేయబోయే సినిమాలో కూడా మంచి ఎమోషనల్ మెసేజ్ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఆ సినిమాలో అనుష్క ఒక విలేజ్ లోని అమ్మాయిగా కనిపించబోతుందట. ఒడిశాలోని ఓ అమ్మాయి జీవితంలో చోటు చేసుకున్న సంఘటన ఆధారంగా దర్శకుడు ఈ కథను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం పూర్తిస్థాయిలో అక్కడి వాతావరణం హైలైట్ అయ్యే విధంగా ఒరిజినల్ ప్లేస్ లోనే ఈ సినిమా షూటింగ్ కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది.

అందుకోసం అనుష్క ముందుగానే వర్క్ షాప్ కూడా నిర్వహించినట్లు సమాచారం. ఇప్పటికే ఆమె కాస్త బరువు కూడా తగ్గినట్లుగా తెలుస్తోంది. తనకు జరిగిన అన్యాయం కోసం ఆమె ఎలా పోరాటం చేసింది అలాగే మిగతా మహిళలకు ఎలా స్ఫూర్తినిచ్చింది అనే అంశాలను ఆ సినిమాలో దర్శకుడు హైలెట్ చేయబోతున్నట్లు సమాచారం. యూనివర్సల్ అప్పీల్ ఉన్న ఈ కథను పాన్ ఇండియా రేంజ్ లోనే రూపొందిస్తున్నారట.

ఎలాగైనా ఈ సినిమాతో దర్శకుడు క్రిష్ బౌన్స్ బ్యాక్ అవ్వాలి అని చూస్తున్నాడు. చివరగా క్రిష్ కొండ పొలం అనే సినిమాను డైరెక్టర్ చేశాడు. కానీ ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. ఇక హరిహర వీరమల్లు వివిధ కారణాల వలన ఆలస్యం అవుతూ ఉండడం వలన ఇప్పుడు అనుష్క ప్రాజెక్టును మాత్రం వీలైనంత తొందరగా ఫినిష్ చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.

ఏపీ కి హైదరాబాద్ రాజధానిగా కొనసాగించాలనే వైవి సుబ్బారెడ్డి కామెంట్స్ ని మీరు సమర్థిస్తున్నారా?@yvsubbareddymp @YSRCParty @INCTelangana @BRSparty #Hyderabad #YSRCP #AndhraPradesh #Telangana #Tupaki

— Tupaki (@tupaki_official) February 13, 2024
Tags:    
  • Krish 
  • Anushka 
  • Hariharaveeramallu 
  • Pawankalyan 
  • Missshettymrpolishetty 
  • Filmindsutry 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS