'ఖైదీ 2' లో స్వీటీ అనుష్క లేడీ డాన్!
ఎల్ సీయూలో భాగంగా లోకేష్ కనగరాజ్ `ఖైదీ 2`కి సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.;
ఎల్ సీయూలో భాగంగా లోకేష్ కనగరాజ్ `ఖైదీ 2`కి సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. `కూలీ` రిలీజ్ అనంతరం పూర్తి స్తాయిలో `ఖైదీ 2` పనుల్లోనే నిమగ్నమవుతాడు. అటు కార్తీ కూడా రెడీ అవుతున్నాడు. చేతిలో ఉన్న ప్రాజెక్ట్ లన్ని పూర్తి చేసుకుని రెడీగా ఉండమని సూచించాడు లోకేష్. `ఖైదీ 2 పట్టాలెక్క డానికి ఇంకొన్ని నెలలు సమయం పడుతుంది. ఈసినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు.
ఖైదీ, విక్రమ్, లియో చిత్రాలకు ముడి పెడుతూ ఖైదీ 2 ఉంటుంది. దీనిలో భాగంగా సినిమాలో చాలా పాత్రలు అదనంగా యాడ్ అవుతాయి. అందులో ఎక్కువగా మేల్ రోల్స్ హైలైట్ అవుతుంటాయి. గత చిత్రాల్లో ఆ పాత్రలను మాత్రమే హైలైట్ చేసాడు. అయితే `ఖైదీ 2` లో అందమైన లేడీ భామల్ని కూడా రంగంలోకి దించుతున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా స్వీటీ అనుష్క ఈ చిత్రంలో లేడీ డాన్ పాత్రలో కనిపించబోతుందని కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
అదే నిజమైతే `ఖైదీ 2`పై అంచనాలు ఇంకా పెరిగిపోతాయి. డాన్ గాళ్ ప్రెండ్ గా నటించిన అనుభవం అనుష్కకు ఉంది. `బిల్లా` చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ వెర్షన్ లో కూడా అనుష్క యధావిధిగా ఆ పాత్ర పోషించింది. కెరీర్ ఆరంభంలో నటించిన సూపర్ చిత్రంలోనూ సూపర్ లేడీగా కనిపించింది. కాబట్టి ఇలాంటి పాత్రలు స్వీటికి కొత్తేం కాదు. అయితే లోకేష్ సినిమాలో డోస్ పరిమితిని మించి ఉంటుంది.
పాత్ర రగ్గడ్ గా..రఫ్ గా ఉంటుంది. ఆ విషయంలో లోకేష్ ఎక్కడా రాజీ పడడు. మేల్ అయినా..ఫీమేల్ అయినా వాళ్ల నుంచి తనకు కావాల్సిన ఔట్ పుట్ పర్పెక్ట్ గా తీసుకుంటాడు. అందుకోసం అనుష్క అద నంగా కష్టపడాల్సి ఉంటుంది. లోకేష్ డెన్ లోకి ఎంటర్ అయితే అనుష్క కెరీర్ కూడా కొత్త టర్నింగ్ తీసు కుంటుంది. ఇది పాన్ ఇండియా చిత్రం కాబట్టి మిగతా భాషల్లోనూ అవకాశాలొస్తాయి.