'ఘాట్ లో ఘాటీలే ఉంటారు సార్'.. పవర్ ఫుల్ గా ఘాటీ ట్రైలర్..

టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఆ సినిమా కూడా ఒకటన్న విషయం తెలిసిందే. విక్ర‌మ్ ప్ర‌భు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.;

Update: 2025-08-06 13:04 GMT

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి.. ఇప్పుడు కెరీర్ లో మళ్ళీ స్పీడ్ పెంచింది. చివరగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీతో వచ్చి మంచి విజయాన్ని అందుకున్న అమ్మడు.. ఇప్పుడు ప్రతిష్టాత్మక మూవీ ఘాటీతో సందడి చేయనుంది. టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఆ సినిమా కూడా ఒకటన్న విషయం తెలిసిందే. విక్ర‌మ్ ప్ర‌భు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఆ సినిమాను క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే అనుష్క, క్రిష్ కాంబోలో వచ్చిన వేదం మూవీ మెప్పించింది. ఇప్పుడు మరోసారి కాంబో రిపీట్ అవ్వడంతో అంతా భారీ అంచనాలు పెట్టుకున్నారు. అదే సమయంలో సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ పాజిటివ్ బజ్ క్రియేట్ చేసి అంచనాలు పెంచాయి.

తాజాగా మూవీ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు మేకర్స్. విడుదల తేదీపై కూడా క్లారిటీ ఇచ్చారు. సెప్టెంబర్ 5వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. థియేటర్లలో చిత్రం ప్రేక్షకులను అలరించనుందని మేకర్స్ హామీ ఇస్తున్నారు. అదే సమయంలో ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినీ ప్రియులను ఆకట్టుకుని దూసుకుపోతోంది. ట్రెండింగ్ లో కూడా నిలిచింది.

ఘాట్లకు చెందిన వ్యక్తిగా అనుష్కను పరిచయం చేశారు మేకర్స్. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తుంటుంది. ఆమె పార్ట్ టైమ్‌లో బస్ కండక్టర్‌ గా పని చేస్తుంటుంది. ఆ టిపికల్ జాబ్ లో కూడా స్ట్రాంగ్ గా వర్క్ చేస్తుంటుంది. విక్రమ్ ప్రభు ఆమె ప్రేమికుడిగా, విప్లవకారుడిగా కనిపిస్తాడు. చైతన్య రావు, జాన్ విజయ్, రవీంద్ర విజయ్‌ విరోధులుగా.. జగపతి బాబు పోలీసు అధికారిగా కనిపిస్తారు.

సినిమాలో అనుష్క నేరస్థురాలిగా మారిన ఓ బాధితురాలిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆమె చేతి పైన ఓ విచిత్రమైన టాటూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఓవరాల్ గా అనుష్కను ఫుల్ వైలెంట్ గా చూపించారు మేకర్స్. అనుష్క కనిపించిన ప్రతి షాట్ చూడటానికి ఒక విందుగా ఉంటుంది. ఘాట్ లో ఘాటీలే ఉంటారు సార్ అంటూ ఆమె చెప్పే డైలాగ్స్ అదిరిపోయాయి.

కఠినమైన కథను ప్రేక్షకులను భావోద్వేగాలతో కదిలించే విధంగా చెప్పడానికి దర్శకుడు క్రిష్ చాలా ప్రయత్నించినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కు బిగ్ అసెట్ గా నిలిచింది. యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. UV క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఓవరాల్ గా ట్రైలర్ ను మేకర్స్ బాగా కట్ చేశారని చెప్పాలి. ష్యూర్ షాట్ విన్నర్‌ గా నిలిచిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని భారీగా రేపింది.

Full View
Tags:    

Similar News