ఇప్పుడు ఆ ఆలోచనే మారిపోయింది: అనుపమ

ఒకప్పుడు తనకు ఏకంగా 11 మంది పిల్లలు ఉండాలని అనుకునేదాన్నని చెప్పిన ఆమె.. ఇప్పుడు మాత్రం పిల్లలే వద్దనే స్థితికి వచ్చానని చెప్పింది.

Update: 2026-08-19 07:12 GMT

అనుపమ పరమేశ్వరన్ రీసెంట్ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడింది. ఒకప్పుడు తనకు ఏకంగా 11 మంది పిల్లలు ఉండాలని అనుకునేదాన్నని చెప్పిన ఆమె.. ఇప్పుడు మాత్రం పిల్లలే వద్దనే స్థితికి వచ్చానని చెప్పింది. దాదాపు రెండేళ్ల పాటు ఉన్న ఒక రిలేషన్‌షిప్ తన ఆలోచనలను ఇంతగా మార్చేసిందని అనుపమ తెలిపింది. ఆ వ్యక్తి పేరు మాత్రం ఎక్కడా బయటపెట్టలేదు.

ఆ రిలేషన్‌లో తనకు ఎదురైన కొన్ని విషయాలను కూడా అనుపమ వివరించింది. పీరియడ్స్ సమయంలో ఏదైనా ప్రశ్నిస్తే, సమస్య గురించి మాట్లాడితే కూడా దాన్ని తన మూడ్‌తో ముడిపెట్టి మాట్లాడేవారని చెప్పింది. ఒక దశలో తాను మహిళగా ఉండటం, పీరియడ్స్ రావడం కూడా తప్పేమో అన్న ఫీలింగ్ వచ్చేలా పరిస్థితి మారిందని తెలిపింది. నటిగా తాను సాధించిన విజయాల విషయంలో కూడా కాన్ఫిడెన్స్ తగ్గిపోయిందని చెప్పుకొచ్చింది.

ఇది కేవలం పర్సనల్ లైఫ్ వరకే ఆగలేదని అనుపమ చెబుతోంది. తాను ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, ఏ సినిమాలు చేయాలి అనే విషయాల్లో కూడా కంట్రోల్ పెరిగిందని చెప్పింది. ‘డ్రాగన్’ తన కెరీర్‌లో పెద్ద సక్సెస్ అయినా ఆ సినిమా ప్రమోషన్స్‌కు ఎందుకు వెళ్లలేదో ఇప్పుడు చెప్పగలనంటూ, ఆ రిలేషన్ కారణంగానే చాలా సినిమాలను కూడా వదులుకున్నట్లు వెల్లడించింది.

మూడు నెలల్లోనే ఎంగేజ్‌మెంట్ గురించి కూడా మాటలు మొదలయ్యాయని అనుపమ తెలిపింది. అయితే తాను మాత్రం వెంటనే ఓకే చెప్పకుండా కొంత టైమ్ కావాలని అడిగిందట. తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు పెళ్లి, పిల్లల గురించి ఒకప్పుడు తనకు ఉన్న ఆలోచనలు కూడా అలాగే లేవని ఆమె మాటల్లో అర్థమవుతోంది. అయితే ఆమె ఎక్కడా తన మాజీ భాగస్వామి పేరు చెప్పలేదు.

పర్సనల్‌గా ఇలాంటి ఫేజ్ నుంచి బయటకు వస్తున్న అనుపమ కెరీర్ మాత్రం బిజీగానే ఉంది. తెలుగులో ప్రస్తుతం ‘క్రేజీ కళ్యాణం’ చేస్తోంది. బద్రప్ప గాజుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తరుణ్ భాస్కర్, వీకే నరేష్, అఖిల్ ఉద్దెమారి కూడా కీలక పాత్రల్లో ఉన్నారు. పెళ్లి బ్యాక్‌డ్రాప్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

మరోవైపు శర్వానంద్‌తో ‘భోగి’ కూడా అనుపమ లైనప్‌లో ఉంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దీంతో పాటు షాన్ దర్శకత్వంలో ఒక సైకాలజికల్ థ్రిల్లర్‌కు కూడా ఆమె లీడ్‌గా ఎంపికైంది. ‘ప్రేమమ్’తో మొదలైన అనుపమ కెరీర్ ఇప్పుడు తెలుగు, తమిళం, మలయాళం అంటూ ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాకుండా సాగుతోంది.

Tags:    

Similar News