• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మా పారితోషికం...

మా పారితోషికం పెంచుతారా... స్టేజ్‌పై నిర్మాతకు హీరోయిన్స్‌ రిక్వెస్ట్‌!

| 12 ఏళ్ల వాయిదా తర్వాత విడుదలైన మదగజరాజ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

By - Tupaki Desk
Update: 2025-01-28 16:30 GMT

విశాల్ హీరోగా అంజలి, వరలక్ష్మి శరత్‌ కుమార్‌ హీరోయిన్స్‌గా రూపొంది మొన్న సంక్రాంతి కానుకగా తమిళ్‌లో వచ్చిన 'మదగజరాజ' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి వారం రోజుల్లోనే అక్కడ దాదాపుగా రూ.40 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది. సుందర్‌ సి దర్శకత్వంలో రూపొందిన మదగజరాజ సినిమా పూర్తి అయ్యి దాదాపు 12 ఏళ్లు అయ్యింది. విడుదలకు కొన్ని అడ్డంకులు రావడంతో ఆగిపోయింది. రెండేళ్ల వరకు అదుగో ఇదుగో అంటూ వాయిదా వేస్తూ వచ్చారు. గత పదేళ్లుగా సినిమా గురించి అంతా మర్చిపోయారు. ఆ సినిమాలో నటించిన వారు సైతం సినిమా గురించి మర్చి పోయి ఉంటారు. అలాంటి సమయంలో విడుదల అయ్యింది.


12 ఏళ్ల వాయిదా తర్వాత విడుదలైన మదగజరాజ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఏమాత్రం అంచనాలు లేకుండా, పెద్దగా ప్రమోషన్‌ చేయకుండా సినిమాను విడుదల చేశారు. కానీ సినిమాకు అనూహ్య స్పందన దక్కడంతో వెంటనే తెలుగులో విడుదల చేయడం కోసం రెడీ అయ్యారు. తెలుగులో హీరోయిన్స్ అంజలి, వరలక్ష్మి శరత్‌ కుమార్‌ వచ్చి ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విక్టరీ వెంకటేష్ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడం జరిగింది. తద్వారా తెలుగులో సినిమాకు పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయ్యింది. జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మదగజరాజ తెలుగు వర్షన్‌ ప్రమోషన్స్‌లో అంజలి, వరలక్ష్మి పాల్గొన్న సమయంలో ఆసక్తికర ప్రశ్న వారికి ఎదురైంది.

ఒక రిపోర్టర్‌ సినిమా 12 ఏళ్ల ముందు చేశారు, అప్పటితో పోల్చితే ఇప్పుడు మీ ఇద్దరి పొజీషన్‌ చాలా బాగుంది. మీకు స్టార్‌డం పెరిగింది. కనుక రెమ్యూనరేషన్‌ ఏమైనా పెంచారా? అంటూ ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు ఇద్దరు హీరోయిన్స్‌ కూడా సమాధానంగా నిర్మాతను చూపిస్తూ... సార్ చెప్పండి, మీరు మాకు పారితోషికం ఏమైనా పెంచుతున్నారా అంటూ అడిగారు. అందుకు నిర్మాత సమయస్ఫూర్తితో తెలుగు కూడా సినిమా హిట్‌ అయితే కచ్చితంగా మీ ఇద్దరికీ పారితోషికం పెంచుతాను అన్నట్లుగా సమాధానం ఇచ్చారు. హీరోయిన్స్‌ సమయస్ఫూర్తికి నిర్మాత సమాధానంకి అక్కడ ఉన్న వారు అంతా గట్టిగా నవ్వారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

తమిళ్‌లో భారీ విజయాలను సొంతం చేసుకున్న సినిమాలు తెలుగులోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. విశాల్‌కి తెలుగులో మంచి మార్కెట్‌ ఉంది. ఒకప్పుడు విశాల్‌ నటించిన ప్రతి తమిళ్‌ మూవీ తెలుగులో డబ్‌ అయ్యేది. తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి కావడంతో తెలుగులో విశాల్‌ కి మంచి ఫాలోయింగ్‌ కూడా ఉంది. అందుకే విశాల్‌ ఈ సినిమాతో తెలుగులో మరోసారి సత్తా చాటుతాడని అంతా భావిస్తున్నారు. ఇటీవల విశాల్‌ తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ మధ్య ఆయన కోలుకుంటున్నారు. ఇంకా అనారోగ్య సమస్యలు వేదిస్తున్న కారణంగానే తెలుగు ప్రమోషన్స్‌ కి దూరంగా ఉన్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Tags:    
  • Anjali 
  • Varalaxmisarathkumar 
  • Madhagajaraja 
  • Vishal 
  • Kollywood 
  • Filmindustry 
  • Remunerations 
  • Movies 
  • Tollywood 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS