• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  11 వేల మందిలో దేవర ఫియర్...

11 వేల మందిలో దేవర ఫియర్ సాంగ్.. గూస్ బంప్స్ వచ్చేలా..

| అనిరుద్ రవిచందర్ కంపోజ్ చేసిన దేవర ఫియర్ సాంగ్ ఏ రేంజ్ లో క్లిక్కయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు

By - Tupaki Desk
Update: 2024-08-23 10:18 GMT

అనిరుద్ రవిచందర్ కంపోజ్ చేసిన దేవర ఫియర్ సాంగ్ ఏ రేంజ్ లో క్లిక్కయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టైటిల్ సాంగ్ గా రిలీజ్ అయిన ఈ పాటకి ఎన్టీఆర్ అభిమానులు ఫిదా అయిపోయారు. అదిరిపోయే ఎలివేషన్ తో వెస్ట్రన్ బీట్స్ తో సాంగ్ చాలా పవర్ ఫుల్ గా ఉందనే టాక్ వచ్చింది. యుట్యూబ్ లో కూడా ఈ సాంగ్ 75 మిలియన్ వ్యూవ్స్ ని అన్ని భాషలలో కలిసి సాధించింది.

ఇదిలా ఉంటే అనిరుద్ రవిచందర్ మ్యూజికల్ నైట్స్ ని మంచి డిమాండ్ ఉంటుంది. రెహమాన్, దేవిశ్రీప్రసాద్, థమన్, అనిరుద్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా విదేశాలలో రెగ్యులర్ గా మ్యూజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తారు. తాజాగా యూఎస్ లోని చికాగో, ఆక్లాండ్, డల్లాస్, న్యూయార్క్ నగరాల్లో హుకుం టూర్ 2024 పేరుతో మ్యూజికల్ నైట్స్ ని అనిరుద్ రవిచందర్ నిర్వహిస్తున్నారు.

ఈ మ్యూజికల్ నైట్స్ కి వేలసంఖ్యలో పబ్లిక్ తరలివస్తున్నారు. ఈ నెల 16న జరిగిన ఫస్ట్ పబ్లిక్ పెర్ఫార్మెన్స్ లో అనిరుద్ రవిచందర్ దేవర సినిమాలోని ఫియర్ సాంగ్ ని ఆలపించి ప్రేక్షకులని ఉర్రూతలూగించారు. ఈ పాట పాడుతున్నంత సేపు థియేటర్ లో ఉన్న క్రౌడ్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ రావడం విశేషం. ఎన్టీఆర్ బ్యానర్స్ పట్టుకొని ఫ్యాన్స్, మిగిలిన పబ్లిక్ డాన్స్ తో సందడి చేశారు.

దీనికి సంబందించిన విజువల్స్ ఇప్పుడు బయటకొచ్చాయి. సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. 11000 మంది క్రౌడ్ మధ్యలో హైలెవల్ లో మాసివ్ బ్లాస్ట్ క్రియేట్ చేసే విధంగా అనిరుద్ రవిచందర్ ఫియర్ సాంగ్ ని ఆలపించాడని వీడియో చూస్తున్నవారు అంటున్నారు. గూస్ బాంబ్స్ క్రియేట్ చేసేలా ఈ విజువల్ మూమెంట్ ఉందనే మాట వినిపిస్తోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు ఈ సాంగ్ కి సంబందించిన వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

అనిరుద్ దేవర ఫియర్ సాంగ్ కి పబ్లికి లో పెర్ఫార్మ్ చేయడం ద్వారా మూవీకి ఓవర్సీస్ లో ఒక్కసారిగా హైప్ పెరిగిపోయిందనే మాట వినిపిస్తోంది. ఫియర్ సాంగ్ కి పబ్లిక్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ను చూస్తుంటే.. యూఎస్ లో ఇప్పటి వరకు ఏ తెలుగు పాటకి వచ్చి ఉండదని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా మ్యూజికల్ నైట్ లో అనిరుద్ ఫియర్ సాంగ్ ని పాడి సినిమాకి భారీగా అటెన్షన్ క్రియేట్ చేసాడని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇక వరల్డ్ వైడ్ గా దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

Star music director #AnirudhRavichander performed the #FearSong live.#Devara #DevaraStorm #JrNTR #KoratalaSiva #Tupakipic.twitter.com/4fCF9ovhI0

— Tupaki (@tupaki_official) August 23, 2024
Tags:    
  • Devara 
  • Jrntr 
  • Tollywood 
  • Koratalasiva 
  • Fearsong 
  • Chicago 
  • Anirudhravichander 
  • Ntrarts 
  • Performance 

Similar News

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

చిరు 'కాకా'.. ఈ కొడవలి వెనుక కథేంటి!

2026-11-08 07:46 GMT

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

Copyright @2026

Powered by Blink CMS