నర్జిటిక్ స్టార్ పాట‌కు రాక్ స్టార్ వాయిస్!

సౌత్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుధ్ గురించి తెలియ‌ని వారుండ‌రు. ప్ర‌స్తుతం ఇండియాలో ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌లో అనిరుధ్ కూడా ఒక‌రు;

Update: 2025-07-12 10:30 GMT

సౌత్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుధ్ గురించి తెలియ‌ని వారుండ‌రు. ప్ర‌స్తుతం ఇండియాలో ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌లో అనిరుధ్ కూడా ఒక‌రు. చిన్న త‌నంలోనే ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా త‌న స‌త్తా చాటారు అనిరుధ్. త‌న టాలెంట్ తో వ‌చ్చి అవ‌కాశాల‌ను అందుకుంటూ సినిమా సినిమాకీ త‌న క్రేజ్ ను పెంచుకుంటూ పోతున్నారు.

ప్ర‌స్తుతం అనిరుధ్ చేతిలో ఎన్నో భారీ ప్రాజెక్టులున్నాయి. కింగ్‌డ‌మ్, మ్యాజిక్, కూలీ, ల‌వ్ ఇన్సూరెన్స్ కంపెనీ, మ‌ద‌రాసీ, జ‌న నాయ‌గ‌న్, ది ప్యార‌డైజ్, జైల‌ర్2, కింగ్ లాంటి ఎన్నో క్రేజీ సినిమాల‌కు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఓ వైపు మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా చాలా బిజీగా ఉంటున్న అనిరుధ్, మ‌రోవైపు సింగ‌ర్ గా కూడా పాట‌లు పాడ‌టం, ఇంకోవైపు మ్యూజిక్ కాన్స‌ర్ట్ లు నిర్వ‌హిస్తూ ఎంతో బిజీగా ఉంటార‌నే విష‌యం తెలిసిందే.

అయితే అనిరుధ్ ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ తాను మ్యూజిక్ చేస్తున్న సినిమాలే కాకుండా ప‌క్క మ్యూజిక్ డైరెక్ట‌ర్ కంపోజ్ చేసే ట్యూన్స్ కు కూడా గాత్రం అందిస్తార‌ని తెలిసిందే. ఇప్ప‌టికే ఎంతో మంది మ్యూజిక్ డైరెక్ట‌ర్లు ట్యూన్ చేసిన పాట‌ల‌ను పాడి త‌న గొంతుతో వాటిని నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లిన అనిరుధ్ ఇప్పుడు మరో సాంగ్ పాడ‌టానికి రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది.

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి ఫేమ్ పి. మ‌హేష్ బాబు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలో అనిరుధ్ ఓ సాంగ్ పాడ‌నున్నట్టు స‌మాచారం. గ‌త కొన్నాళ్లుగా ఈ సినిమాలో హీరో రామ్ ఓ సాంగ్ ను రాశార‌ని వార్త‌లు రాగా, ఇప్పుడు పాట‌ను అనిరుధ్ పాడ‌టానికి ఒప్పుకున్నార‌ని అంటున్నారు. ఆల్రెడీ దానికి సంబంధించిన వ‌ర్క్స్ జ‌రుగుతున్నాయ‌ని, ఈ నెలాఖారు నాటికి ఆ స్పెష‌ల్ సాంగ్ ను రిలీజ్ చేయాల‌ని చూస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఇప్ప‌టికే వివేక్- మెర్విన్ మ్యూజిక్ లో ప‌లు పాట‌లు పాడిన అనిరుధ్ ఇప్పుడు మ‌రోసారి రామ్ సినిమా కోసం పాడ‌నున్నారంటున్నారు. అయితే ఈ విష‌యంలో అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. భాగ్య‌శ్రీ బోర్సే హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్ర హీరో పాత్ర‌లో న‌టించ‌నున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తుండ‌గా, ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతుంది.

Tags:    

Similar News