వెంకీ- క‌ళ్యాణ్ రామ్ కోసం వైజాగ్‌లో అనిల్!

కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామాను కమర్షియల్ ఫార్మాట్‌లో అందించే అనిల్ స్టైల్ ఈ కాంబినేషన్‌కు బాగా సెట్ అవుతుందనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

Update: 2026-05-16 07:56 GMT

టాలీవుడ్‌లో ఇటీవల ప్రకటించిన సినిమాల్లో ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి రేపుతున్న ప్రాజెక్ట్‌లలో వెంకటేష్ – నందమూరి కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ ఒకటి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన వెంకీ మామ, మరోవైపు మాస్ ఇమేజ్‌తో పాటు విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్న కళ్యాణ్ రామ్ కలిసి నటించనున్నారనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచే ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడనగానే అంచనాలు మరింత పెరిగిపోయాయి. కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామాను కమర్షియల్ ఫార్మాట్‌లో అందించే అనిల్ స్టైల్ ఈ కాంబినేషన్‌కు బాగా సెట్ అవుతుందనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా వెంకటేష్ కామెడీ టైమింగ్, కళ్యాణ్ రామ్ సీరియస్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే స్క్రీన్‌పై కొత్త రకమైన ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్ సిద్ధమవుతుందనే అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే ఎఫ్2, ఎఫ్3 వంటి ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో భారీ విజయాలు అందుకున్న అనిల్ రావిపూడి, ఈసారి కూడా అదే జానర్‌లో మరింత ఫ్రెష్ సెటప్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు విశాఖపట్నంలో వేగంగా జరుగుతున్నాయని సమాచారం. ఇందుకోసం అనీల్ అండ్ టీం ప్రత్యేకంగా వైజాగ్‌లో క్యాంప్ వేసి కథ, స్క్రీన్‌ప్లే, క్యారెక్టర్ డిజైన్స్‌పై సీరియస్‌గా వర్క్ చేస్తున్నారట. సాధారణంగా అనీల్ సినిమాలు స్పాంటేనియస్ కామెడీతో నడుస్తాయనే అభిప్రాయం ఉన్నా, ఈసారి మాత్రం స్క్రిప్ట్ విషయంలో ఆయన మరింత పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నారని టాక్. వెంకటేష్, కళ్యాణ్ రామ్ ఇద్దరి ఇమేజ్‌లకు సరిపోయేలా కథలో ఎమోషన్, కామెడీ, యాక్షన్ బ్యాలెన్స్ చేసే పనిలో టీం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు బీ, సీ సెంటర్ల మాస్ ప్రేక్షకులను కూడా టార్గెట్ చేసేలా కథను తీర్చిదిద్దుతున్నారట.

మరోవైపు వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం సినిమాతో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యాక వెంటనే ఈ మల్టీస్టారర్ సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కళ్యాణ్ రామ్‌కు కూడా ఇది కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమా కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బింబిసార తర్వాత ఆయన కొత్త తరహా కథలు, కొత్త కాంబినేషన్స్‌పై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు వెంకటేష్ వంటి సీనియర్ స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆయన ఇమేజ్‌కు కొత్త డైమెన్షన్ తీసుకురావచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. పైగా సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ వంటి పెద్ద బ్యానర్లు కలిసి ఈ సినిమాను నిర్మిస్తుండటం ప్రాజెక్ట్ స్థాయిని మరింత పెంచుతోంది.

అయితే ఇంకా షూటింగ్ ప్రారంభం కాకముందే ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ టైమ్‌పై కూడా ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ లేదా సమ్మర్ రేస్‌లో ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా అనీల్ రావిపూడి సినిమాలకు ఫెస్టివల్ సీజన్లలో మంచి ఆదరణ లభిస్తుండటంతో మేకర్స్ కూడా అదే దిశగా ప్లాన్ చేసే ఛాన్స్ ఉందని టాక్. మొత్తంగా చూస్తే ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్‌లో రాబోయే రోజుల్లో అత్యంత క్రేజీ మల్టీస్టారర్‌లలో ఒకటిగా మారే సూచనలు ఇప్పటినుంచే కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News