అభిమానులు అలా ఏడిపిస్తున్నారు.. సయ్యారా నటి
''నా అభిమానులు, అభిమాన సంఘాలు నేను నటించిన కొన్ని వీడియోలను క్రమం తప్పకుండా సృష్టిస్తున్నారు.;
''నా అభిమానులు, అభిమాన సంఘాలు నేను నటించిన కొన్ని వీడియోలను క్రమం తప్పకుండా సృష్టిస్తున్నారు. వాటిలో ఎడిట్ చూసి నేను వారానికి ఒకసారి అయినా ఏడుస్తాను. నామీద అభిమానుల అపరిమిత ప్రేమకు నేను చాలా ఎమోషన్‌కి గురవుతాను'' అని చెప్పింది అనీత్ పద్దా. సయ్యారా వీడియోలను ఎడిట్ చేస్తారు. అందులో కచ్ఛితంగా నా సహనటుడు అహాన్ కూడా కనిపిస్తాడు. అది వారి ప్రేమ. అపరిమితమైన ప్రేమ. దానికి నేను ఎప్పుడో దాసోహం అయిపోయాను. వారి ప్రేమ, అభిమానం నాపై ఒత్తిడిని పెంచుతున్నాయి. అది మరింత బాధ్యతగా మారుతోంది! అని కూడా అనీత్ చెప్పారు.
అనీత్ పద్దా సయ్యారా లో నటించక ముందు నుంచి సినీప్రపంచంలో ఉన్నారు. నటిగా కొనసాగారు. కానీ సయ్యారా తన కీర్తిని రాత్రికి రాత్రే అమాంతం పెంచేసింది. ప్రస్తుతం తన తదుపరి చిత్రం `శక్తి శాలిని` చిత్రీకరణ కోసం సిద్ధమవుతోంది. ఇప్పటికే అభిమానులు, శ్రేయోభిలాషుల హృదయాలలో అనీత్ నిలిచి ఉంది.
తాజా ఇంటర్వ్యూలో తనకు లభించే ప్రేమ మద్ధతుకు ధన్యవాదాలు తెలిపింది. అదే సమయంలో అభిమానుల ప్రేమ, ఒత్తిడిని పెంచుతోందని కూడా వెల్లడించింది. గ్రాజియా ఇండియాతో తాజా ఇంటర్వ్యూలో.. అనీత్ తన అభిమానులు, కుటుంబం, స్నేహితుల నుండి లభించే మద్దతు అపరిమితంగా తనను నిలబెడుతోందని అంగీకరించారు. నేను సున్నితమైన అమ్మాయిని.. అందుకే ప్రతి మద్ధతు ఒత్తిడిని పెంచుతుంది. బాధ్యతను బరువును పెంచుతుందని అనీత్ అన్నారు.
అనీత్ పద్దా కెరీర్ ప్రయాణం ఎలా సాగిందో పరిశీలిస్తే చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అనీత్ వయసు ఇప్పుడు 23. కానీ యుక్తవయస్సులో ఉన్నప్పుడే మోడలింగ్ ప్రారంభించింది. కొన్ని ప్రకటనల్లో నటించింది. 2022లో కాజోల్ నటించిన సలాం వెంకీలో చిన్న పాత్రతో ఆమె నటిగా అరంగేట్రం చేసింది. 2024లో ప్రీమియర్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో షో `బిగ్ గర్ల్స్ డోంట్ క్రై`తో తొలి పెద్ద బ్రేక్ లభించింది. ఆ తర్వాతి సంవత్సరం యువ `సప్నో కా సఫర్` అనే టీవీ షో తనకు మంచి పేరు తెచ్చింది.
మోహిత్ సూరి తెరకెక్కించిన 2025 రొమాంటిక్ డ్రామా సయ్యారా అనీత్ పద్దా- అహాన్ జంట లైఫ్ నే మార్చేసింది. ఇప్పుడు ఆ ఇద్దరూ అసాధారణ స్టార్ డమ్ ని ఆస్వాధిస్తున్నారు. సయ్యారా బాక్సాఫీస్ వద్ద దాదాపు 580 కోట్లు వసూలు చేసింది. యష్ రాజ్ ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు చేసిన రొమాంటిక్ చిత్రంగా నిలిచింది. ఇందులో నాయకానాయికల కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న యువ రచయితగా అనీత్ అద్భుత నటన, ఆమె ప్రేమికుడిగా అహాన్ నట ప్రదర్శన ప్రేక్షకులను కట్టి పడేసాయి. ఇప్పుడు మాడాక్ ఫిల్మ్స్ హారర్ కామెడీ `శక్తి శాలిని`లో అనీత్ మరో అద్భుత ప్రదర్శనతో రక్తి కట్టించడానికి సిద్ధమవుతోంది.