ఆల్బ‌మ్ తో ఊపు తెచ్చిన ఆట‌గాడు!

ఇప్ప‌టికే వెస్టీండీస్ మాజీ ప్లేయ‌ర్ డ్వేన్ బ్రావోకి బాలీవుడ్‌తో రిలేష‌న్ షిప్ మెయింటెన్ చేస్తుంటాడు.

Update: 2024-05-10 06:19 GMT

సినిమా వాళ్ల‌కు-క్రికెట‌ర్ల మ‌ధ్య ఉన్న అవినాభావ సంబంధం ఈనాటిది కాదు. కొన్ని ద‌శాబ్దాలుగా ఆ రెండు రంగాల మ‌ధ్య ఎంతో గొప్ప బాండింగ్ కొన‌సాగుతుంది. ఇండియా క్రికెట‌ర్ల‌ను ప‌క్క‌న‌బెడితే విదేశీ క్రికెట‌ర్ల‌కు బాలీవుడ్ మ‌ధ్య మంచి కూడా మంచి సత్స‌సంబంధాలున్నాయి. అందులోనూ వెస్టిండీస్‌కు బాలీవుడ్ తారలకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఐపీఎల్ కాణంగా ఆ బాండింగ్ మ‌రింత బ‌ల‌ప‌డింది. ఇప్ప‌టికే వెస్టీండీస్ మాజీ ప్లేయ‌ర్ డ్వేన్ బ్రావోకి బాలీవుడ్‌తో రిలేష‌న్ షిప్ మెయింటెన్ చేస్తుంటాడు.

గతంలో ఇండియన్ మ్యూజిక్ లవర్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఓ మ్యూజిక్ ఆల్బమ్ కూడా చేశాడు. అవ‌కాశం వ‌స్తే న‌టుడిగా బాలీవుడ్ లో మ్యాక‌ప్ వేసుకోవ‌డానికి కూడా రెడీగా ఉన్నాడు. ఇక పాటలు పాడ‌టం అంటే బ్రావోకి ఎంతో ఇష్టం. అందులో మంచి అనుభ‌వం కూడా ఉంది. అందుకే బాలీవుడ్ పిలిచి మ‌రీ ఆల్బ‌మ్ ఛాన్స్ ఇచ్చింది. అలాగే క్రిస్ గేల్ కూడా త‌న‌దైన మార్క్ పెర్పార్మెన్స్ తో అల‌చిరించాడు. ఈ నేప‌థ్యంలో తాజాగా బ్రావో బాటలో మరో క్రికెటర్ ముందుకొచ్చాడు.

Read more!

ఇండియన్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఓ మ్యూజిక్ ఆల్బమ్ చేసాడు ఆండ్రూ రస్సెల్. ఇందులో అవికాగోర్ అలియాస్ చిన్నారి పెళ్లికూతురు కూబా బాగైంది. ఇద్ద‌రు క‌ల‌సి ఈ ఆల్బ‌మ్ చేసారు. `ల‌డికి తూ క‌మాల్` అనే ఆల్బ‌మ్ ఇది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో రిలీజ్ అయింది. ఇందులో ర‌స్సెల్ లుంగీ డాన్సుతో అద‌ర‌గొట్టాడు. అవికా నీలిరంగు చీర‌లో అంతే అందంగా అల‌రించింది. ఇద్దరు ఆడిపాడుతుంటే కిర్రాళ్ల‌లో ఊపు మొద‌లైంది.

ఇద్ద‌రి ఎన‌ర్జిటిక్ పెర్పార్మెన్స్ తో ఆక‌ట్టుకున్నారు. ర‌స్సెల్ మేకోవ‌ర్ స్టైలిష్ గా ఉంది. అందుకు భిన్నంగా అవికా సంప్ర‌దాయ చీర‌క‌ట్టులో ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది. అభిమానులు ఇద్ద‌రి పెర్పార్మెన్స్ ని ఉద్దేశించి ఆస‌క్తిక‌ర కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ర‌స్సెల్ మంచి సింగ‌ర్ కూడా. `డంకీ` సినిమాలోని ఓ పాట‌ని పాడి షారుక్ ఖాన్ లో సైతం ఉత్సాహం నింపిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News