ఏపీకి సినీ ఇండస్ట్రీ రావాల్సిందేనా? బెనిఫిట్స్ ఏంటి?

ఆంధ్రప్రదేశ్‌ లో ఇండస్ట్రీకి స్థలం కేటాయించి, ఇండస్ట్రీని ఇంకా ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం ఆలోచించాలని ఆయన కోరారు.

Update: 2026-07-16 05:47 GMT

టాలీవుడ్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్‌ కు రావాలన్న చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. నటుడు శివాజీ కామెంట్స్ ఆ విషయాన్ని మళ్లీ హాట్ టాపిక్‌ గా మార్చాయి. గుంటూరులో జరిగిన లెనిన్ మూవీ సక్సెస్ మీట్‌ లో ఆయన చేసిన కామెంట్స్ కేవలం సినిమా విషయానికే పరిమితం కాకుండా, ఏపీ ఫ్యూచర్ డెవలెప్మెంట్ కోసం కూడా చర్చకు దారితీశాయి. ఆంధ్రప్రదేశ్‌ లో ఇండస్ట్రీకి స్థలం కేటాయించి, ఇండస్ట్రీని ఇంకా ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం ఆలోచించాలని ఆయన కోరారు.

ప్రస్తుతం తెలుగు పరిశ్రమకు మెయిన్ సెంటర్ గా హైదరాబాద్ ఉంది. స్టూడియోలు, పోస్ట్ ప్రొడక్షన్ సౌకర్యాలు, టెక్నికల్ సోర్సెస్, శిక్షణ పొందిన సిబ్బంది అంతా అక్కడే ఉన్నారు. దీంతో వేలాది మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. శివాజీ చెప్పినట్టుగా రోజూ అనేక సినిమాల షూటింగ్లు జరుగుతుండటం వల్ల భారీ స్థాయిలో ఫైనాన్సియల్ ట్రాన్సక్షన్స్ కొనసాగుతున్నాయి.

అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ లో కూడా సినీ రంగానికి సంబంధించిన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ అప్పుడప్పుడూ వినిపిస్తోంది. వైజాగ్, విజయవాడ, గుంటూరు, తిరుపతి వంటి నగరాల్లో షూటింగ్లకు అనుకూలమైన ప్రాంతాలు ఉన్నప్పటికీ, కంప్లీట్ సినీ హబ్ మాత్రం ఇంకా రూపుదాల్చలేదు. ఈ నేపథ్యంలో ఏపీలో ఇండస్ట్రీ ఎక్స్పాండ్ అయితే లోకల్ యూత్ కు కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది.

సినీ పరిశ్రమ ఒక సినిమా నిర్మాణంతోనే పరిమితం కాదు. దాని చుట్టూ హోటళ్లు, ట్రాన్స్ పోర్ట్, ఈవెంట్ మేనేజ్మెంట్, కాస్ట్యూమ్స్, సెట్స్ నిర్మాణం, డిజిటల్ సేవలు, ఫుడ్ సప్లై వంటి అనేక రంగాలు అభివృద్ధి చెందుతాయి. ఒక పెద్ద స్టూడియో ఏర్పడితే వందల మందికి జాబ్స్, వేల మందికి ఉపాధి లభిస్తుంది. అలాగే ఏపీలో సినీ పరిశ్రమకు సంబంధించిన మౌలిక వసతులు ఏర్పడితే రాష్ట్రంలోని టాలెంటెడ్ యూత్ బయటకు వెళ్లాల్సిన అవసరం కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.

నటన, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వంటి రంగాల్లో కెరీర్‌ ను నిర్మించుకోవాలనుకునే వారికి అవకాశాలు దొరకవచ్చు. పర్యాటక రంగానికి కూడా ఇది అదనపు బలం కావచ్చు. వైజాగ్ బీచ్, అరకు లోయ, గోదావరి ప్రాంతాలు, రాయలసీమ అందాలు సినిమాల ద్వారా మరింత ప్రచారం పొందే అవకాశం ఉంటుంది. అయితే పరిశ్రమను ఒక ప్రాంతానికి తీసుకురావడం అంత ఈజీ కాదు.

స్టూడియోలు, సాంకేతిక వసతులు, పెట్టుబడులు, రవాణా సదుపాయాలు, నిపుణుల అందుబాటు వంటి అంశాలు కీలకం. గవర్నమెంట్ సబ్సిటీతో పాటు పరిశ్రమ వర్గాల సహకారం కూడా అవసరం. కేవలం భూములు కేటాయించడం మాత్రమే కాకుండా, పక్క ప్లాన్ తో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఏపీకి ఇండస్ట్రీలో మరింత భాగస్వామ్యం లభిస్తే ఉపాధి, పెట్టుబడులు, యూత్ క్ అవకాశాలు పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు ఆ అంశంపై ప్రభుత్వం, పరిశ్రమ వర్గాలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News