యాంకర్ల నిశ్శబ్దం వెనక నిగూడ రహస్యం..?

ఆ సక్సెస్ ఫుల్ యాంకర్స్ లో కొందరు ఇప్పటికీ కొనసాగుతున్నారు. మరికొందరైతే అసలు ఫాం లోనే లేరు.;

Update: 2025-08-06 05:10 GMT

ప్రతి విషయంలో పోటీ అనేది కామన్. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఈ పోటీ వల్ల ముందుకెళ్లిన వాళ్లు.. వెనకపడిన వాళ్ల మధ్య కాస్త రుసరుసలు ఉంటాయి. ఐతే సిల్వర్ స్క్రీన్ మీదే కాదు స్మాల్ స్క్రీన్ మీద కూడా ఇదే ఉంటుంది. కెరీర్ సూపర్ జోష్ ఉన్న వారు కొందరైతే ఛాన్స్ లు లేక కెరీర్ వెనకపడ్డ వారు మరికొందరు. ఐతే ఇక్కడ లక్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది. ఐతే స్మాల్ స్క్రీన్ యాంకర్స్ విషయంలో కొందరు సక్సెస్ అయ్యారు. ఆ సక్సెస్ ఫుల్ యాంకర్స్ లో కొందరు ఇప్పటికీ కొనసాగుతున్నారు. మరికొందరైతే అసలు ఫాం లోనే లేరు.

ఉదయభాను యాంకరింగ్ అంటే అదో స్పెషల్ క్రేజ్..

అలాంటి వారిలో ఉదయభాను వస్తారు. ఒకప్పుడు బుల్లితెర మీద ఉదయభాను యాంకరింగ్ అంటే అదో స్పెషల్ క్రేజ్. ఆమె చేసే యాంకరింగ్ తోనే చాలా షోస్ సూపర్ హిట్ అయ్యాయి. బుల్లితెర మీద యాంకరింగ్ తో కూడా ఉదయభాను ఒక చిన్నపాటి హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకున్నారు. ఐతే అప్పట్లో స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఉదయభాను ఇప్పుడు అసలు ఛాన్స్ లు లేక చాలా వెనకపడ్డారు.

ఆఫ్టర్ లాంగ్ టైం ఆమె మళ్లీ తెర మీద కనిపిస్తున్నారు. యాంకర్ గా కూడా ఈమధ్య ఒకటి రెండు షోస్ చేశారు. సుహాస్ సినిమాకు ఉదయభాను యాంకరింగ్ చేసింది. ఐతే ఆ టైం లో యాంకరింగ్ లో తొక్కేస్తున్నారంటూ ఉదయభాను చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. నా లాంటి వాళ్లని కూడా రానివ్వట్లేదు అంటూ ఉదయభాను దుమారం రేపింది. రీసెంట్ గా ఒక సినిమా ఈవెంట్ లో ఉదయభానుని దాని గురించి అడిగితే.. నేను నిజాలే మాట్లాడతా అంటూ మరోసారి షాక్ ఇచ్చారు. ఇది సందర్భం కాదు కానీ మా ప్రత్యూష కూడా నిశ్శబ్దం గా ఉంది.. నేనైతే ఎప్పుడు నిజాలే మాట్లాడతా అన్నారు ఉదయభాను.

ఝాన్సీ , సుమతో పాటు ఉదయభాను కూడా..

కాస్త వెనక్కి వెళ్తే.. తెలుగు బుల్లితెర యాంకర్స్ లో ఝాన్సి, సుమతో పాటు ఉదయభాను కూడా స్టార్ యాంకర్ గా క్రేజ్ తెచ్చుకున్నారు. ఐతే ఝాన్సీ ఈమధ్య యాంకరింగ్ మానేసి సినిమాల్లో నటిస్తున్నారు. ఝాన్సీ కి కూడా అవకాశాలు లేక సినిమాలు చేస్తుందా అంటే.. ఏదైనా సరే స్ట్రైట్ టు ద పాయింట్ మీడియా ముందు పెట్టే ఝాన్సీ తనని ఎవరో తొక్కేశారని ఎప్పుడు చెప్పలేదు.

ఇక సుమ యాంకరింగ్ గురించి అందరికీ తెలిసిందే. దాదాపు ఆమె 15 ఏళ్లుగా యాంకరింగ్ చేస్తూనే ఉంది. సినిమా ఈవెంట్స్ అంటే చాలు సుమ యాంకరింగ్ ఉండాల్సిందే. ఆమె చలాకీతనం, స్పాంటేనిటీ, ఫ్యాన్స్ లో జోష్ నింపే ఉత్సాహం ఇలా అన్నిటిలో సుమ అదరగొట్టేస్తారు. అందుకే ఆమె ది బెస్ట్ అనిపించుకున్నారు. ఉదయభాను, ఝాన్సీ మధ్యలో ఏ కారణాల వల్ల ఆగారో కానీ సుమ మాత్రం అప్పుడు ఇప్పుడు రకరకాల షోస్, ఈవెంట్స్ చేస్తూ సక్సెస్ ఫుల్ యాంకర్ గా కొనసాగుతున్నారు.

ఉదయభాను చేసిన కామెంట్స్ ..

ఝాన్సీ, సుమతో ఈక్వల్ రేంజ్ యాంకర్ గా క్రేజ్ తెచ్చుకున్నారు ఉదయభాను. ఐతే ఎందుకో ఆమె మధ్యలోనే కెరీర్ ఆపేశారు. ఐతే ఉదయభానుకి అవకాశాలు రాకుండా చేశారు కాబట్టే ఆమె ఆగిపోవాల్సి వచ్చిందని ఉదయభాను చేసిన కామెంట్స్ ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఉదయభాను ఊరకనే మాట అనేస్తే కుదరదు కదా అసలు యాంకర్ల మధ్య ఈ నిశ్శబ్దంగా ఉన్న ఈ నిగూడ రహస్యాలు కచ్చితంగా బయటకు రావాల్సిందే.

అలా వస్తేనే ఎవరు ఎవరిని తొక్కేశారు.. ఎవరు ఎవరికి అవకాశాలు లేకుండా చేశారన్నది తెలుస్తుంది. మరి ఉదయభాను కనిపించిన ప్రతిసారి యాంకర్ గా తనని తొక్కేశారని అనడం కన్నా వాటికి సంబంధించిన పూర్తి డీటైల్స్ తో క్లారిటీ ఇస్తే నిజానిజాలు ఏంటన్నది ఆడియన్స్ కు కూడా తెలుస్తుంది.

Tags:    

Similar News