• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆర్జీవీని ఫాలో అవుతున్న...

ఆర్జీవీని ఫాలో అవుతున్న అనసూయ!?

| కావాలనే ఏదో ఒకటి వివాదం క్రియేట్​ చేసేందుకు.. నెటిజన్ల దృష్టిలో పడేలా పోస్ట్​లు పెట్టి.. ఆ తర్వాత వారి చేత ఏదో ఒకటి అనిపించుకుని.. మళ్లీ రియాక్ట్​ అవ్వడం ఆమెకు సర్వసాధరణమైపోయింది" అని చాలా మంది అభిప్రాయపడుతుంటారు.

By - Tupaki Desk
Update: 2023-10-30 04:30 GMT

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రెస్​ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు దర్శకుడు రామ్​ గోపాల్ వర్మ. కానీ ఇప్పుడు ఆయనతో పాటు మరో నటి అనసూయ కూడా చేరిందా అని అనిపిస్తుంది అంటున్నారు సోషల్ మీడియా జనం . ఎందుకంటే ఇప్పుడు ఆ రేంజ్​లో సోషల్​ మీడియాలో ఆమె పేరు కాంట్రవర్సీలతో మార్మోగిపోతోంది. ముక్కుసూటిగా మాట్లాడటంలో అనసూయ తర్వాతే ఎవరైనా అని చెప్పాలి.

స్మాల్ స్క్రీన్​, సిల్వర్​ స్క్రీన్​పై తనకంటూ స్పెషల్​ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ.. కాంట్రవర్సీకి కేరాఫ్​ ఆడ్రెస్​ అని చాలా మంది అంటున్నారు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో మీడియాలో చర్చనీయాంశంగా మారుతుంటుందని చెబుతున్నారు. "నెటిజన్లు అయితే  అనసూయకు ఎప్పుడూ కాంట్రవర్సీ కావాలి. అందుకే సోషల్​ మీడియాలో తన పై ఎక్కువ కామెంట్స్​ వచ్చేలా, పబ్లిసిటీ రావడం కోసం ఏదో ఒకటి పెడుతూనే ఉంటుంది.

కావాలనే ఏదో ఒకటి వివాదం క్రియేట్​ చేసేందుకు.. నెటిజన్ల దృష్టిలో పడేలా పోస్ట్​లు పెట్టి.. ఆ తర్వాత వారి చేత ఏదో ఒకటి అనిపించుకుని.. మళ్లీ రియాక్ట్​ అవ్వడం ఆమెకు సర్వసాధరణమైపోయింది" అని చాలా మంది  నెటిజెన్స్ అభిప్రాయపడుతుంటారు.

హీరో విజయ్​ దేవరకొండతో వివాదం... ఇలా ఎన్నో విషయాలతో వివాదాలను ఎదుర్కొంటూనే ఉంటుంది. తాజాగా కూడా అలనాటి తారలు సావిత్రి, జమున, శ్రీదేవి, సౌందర్య వేషధారణతో కనిపించి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే సావిత్రి వేషధారణపై కొంతమంది నెటిజన్లు విమర్శలు చేయగా.. "ఎక్స్‌పోజ్‌ చేసినంత తేలిక కాదు సావిత్రిలా నటించడమంటే. అలానే ఎక్స్‌పోజింగ్‌ చేయడం కూడా తేలిక కాదు. శారీరకంగా మానసికంగా చాలా ప్రిపేర్‌ అవ్వాలి" అని తిరిగి రీకౌంటర్ వేసింది.

ఇలా ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని క్రియేట్ చేస్తూ.. తనపై నెగెటివ్ కామెంట్స్​ చేసినవారి భరతం పడుతున్నానంటూ అనసూయ చెప్పుకొస్తోందని చాలా మంది అనుకుంటున్నారు. ఆర్జీవి కూడా ఇలానే వివాదాల్ని సృష్టించి పబ్లిసిటీ చేసుకుంటాడు. నువ్వు కూడా ఆయన్నే ఫాలో అవుతున్నావ్​ అంటూ కామెంట్స్​ చేస్తున్నారు. ఏది ఏమయ్యింది ఇలా ట్రోల్ చేసే వాళ్ళని అనసూయ బ్రో డోంట్ కేర్ అని అంటుంది అది వేరే విషయం.

Tags:    
  • Tollywood 
  • Ramgopalvarma 
  • Anasuya 
  • Vijaydevarakonda 
  • Savitri 
  • Jamuna 
  • Sridevi 
  • Soundarya 

Similar News

'రంగ‌స్థ‌లం' చిట్టి బాబును..'పుష్ప‌' పుష్ప‌రాజ్‌ను మించేలా..!

2026-11-10 03:51 GMT

అత్త‌మ్మ‌తో అల్లు కోడ‌ళ్లు వెరీ స్పెష‌ల్ దీపావ‌ళి

2026-11-10 03:51 GMT

ఎందుకు ఇబ్బంది పెడతారు.. రేణు దేశాయ్ ఫైర్

2026-11-10 03:50 GMT

కోడ‌ళ్ల‌తో అక్కినేని స్పెష‌ల్ దీపావ‌ళి సంబ‌రాలు

2026-11-10 03:49 GMT

Bigg Boss Telugu: నామినేషన్స్ లో బిగ్‌ బాస్ అదిరిపోయే ట్విస్ట్!

2026-11-10 03:47 GMT

దీపావ‌ళి లుక్‌తో క‌ట్టి ప‌డేసిన న‌టి కం గాయ‌ని

2026-11-09 22:30 GMT

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

Copyright @2026

Powered by Blink CMS