అనసూయ క్రేజ్ అలా ఉంది మరి.. అల్లకల్లోలం!

ఆ సమయంలో ఈ బ్యూటీ.. ట్రాన్స్పరెంట్ శారీలో వచ్చింది. చీరకట్టులో వచ్చిన అనసూయ తన అందంతో ఆకట్టుకుంది. స్టోర్ ను ప్రమోట్ చేస్తూనే.. ఫ్యాన్స్ తో సరదాగా ముచ్చటించింది.

Update: 2024-02-26 17:04 GMT

బుల్లితెర యాంకర్ గా అనసూయ ఎలాంటి గుర్తింపు సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. జబర్దస్త్ కామెడీ షోతో ఈ అమ్మడు సెన్సేషన్ క్రియేట్ చేసింది. గ్లామరస్ లుక్స్ లో అలరిస్తూ తన యాంకరింగ్ తో స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ ను ఓ రేంజ్ లో మెప్పించింది. కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందించింది. ఆ తర్వాత వివిధ షోల ద్వారా తన టాలెంట్ ను నిరూపించుకుంది అనసూయ. డ్యాన్స్ లతో కూడా అలరించింది.

 

అలా వరుస సినిమాలు అవకాశాలు దక్కించుకుని బుల్లితెరకు అనూహ్యంగా గుడ్ బై చెప్పేసింది. చేతి నిండా సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. నటిగా తనలో ఉన్న ప్రతిభను చాటుకుంది. మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు కొత్త పిక్స్ ను షేర్ చేసుకుంటూ తనదైన శైలిలో క్యాప్షన్ ఇస్తుంటోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో మెరుస్తూ సందడి చేస్తుంటోంది. తన ఫాలోవర్స్ కు ఎప్పటికప్పుడు పలకరిస్తూనే ఉంటోంది.

అనసూయ ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కు చీఫ్ గెస్ట్ లుగా వెళ్తుంటోంది. తాజాగా విజయనగరంలో మెరిసింది. సిటీలోని శృంగవరపు కోట ఏరియాలో కొత్త గా పెట్టిన సిల్క్ స్టోర్ ను ప్రారంభించింది. ఆ సమయంలో ఈ బ్యూటీ.. ట్రాన్స్పరెంట్ శారీలో వచ్చింది. చీరకట్టులో వచ్చిన అనసూయ తన అందంతో ఆకట్టుకుంది. స్టోర్ ను ప్రమోట్ చేస్తూనే.. ఫ్యాన్స్ తో సరదాగా ముచ్చటించింది.

అయితే అనసూయ వస్తుందని ముందు నుంచే స్టోర్ యాజమాన్యం ప్రచారం చేసింది. దీంతో అనసూయను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. చుట్టుపక్క ప్రాంతాలకు చెందిన కుర్రాళ్లు, మహిళలు వేల సంఖ్య సిల్క్ స్టోర్ వద్దకు చేరుకున్నారు. అనసూయను చూసి ఫుల్ సందడి చేశారు. సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టారు.

వాస్తవానికి యాంకర్ కు ఇంత క్రేజ్ ఉండడం అంటే గ్రేట్ అనే చెప్పాలి. అనసూయను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రంగమ్మత్త క్రేజ్ అలా ఉంది మరి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక అనసూయ నటిస్తున్న రజాకార్ మూవీ మార్చి 15వ తేదీన రిలీజ్ కానుంది. పుష్ప-2 ఆగస్టు 15న విడుదలవ్వనుంది.

Tags:    

Similar News