పిక్‌టాక్‌ : టైట్‌ డ్రెస్‌లో అందాల అనన్య

ప్రస్తుతం బాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఈమె సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది.;

Update: 2025-07-16 12:19 GMT

బాలీవుడ్‌ నటుడు చుంకీ పాండే నట వారసురాలిగా 'స్టూడెంట్‌ ఆఫ్ ది ఇయర్‌ 2' సినిమాతో హిందీ సినిమా పరిశ్రమలో అడుగు పెట్టింది అనన్య పాండే. తండ్రి వారసత్వంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టడంతో వరుసగా ఆఫర్లు దక్కాయి. కెరీర్‌ ఆరంభంలో హిట్‌, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా అనన్య పాండే ఆఫర్లు దక్కించుకుంది. అయితే ఇండస్ట్రీలో ఈమె అడుగు పెట్టిన సమయంలోనే కరోనా కారణంగా రెండు ఏళ్ల పాటు కాస్త తక్కువ సినిమాలు చేయాల్సి వచ్చింది. కరోనా తర్వాత ఈమె బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలు చేస్తోంది. తెలుగులో ఈమె చేసిన లైగర్‌ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. దాంతో టాలీవుడ్‌ వైపు ఈమె తిరిగి చూడాలి అనుకోలేదు.


ప్రస్తుతం బాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఈమె సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. ఆకట్టుకునే అందంతో పాటు, రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏం చేసినా కూడా వాటిని ఫోటోలు తీసి ఇన్‌స్టాలో షేర్‌ చేసి అనన్య పాండే తాజాగా వర్కౌట్‌ డ్రెస్‌ ను ధరించి ఆ ఫోటోలను షేర్ చేసింది. అంతే కాకుండా స్విమ్‌ సూట్‌ను ధించిన సమయంలోనూ ఈమె సోషల్‌ మీడియాలో ఫోటోలను షేర్‌ చేయడం చూస్తూ ఉన్నాం. తాజాగా ఈ టైట్‌ డ్రెస్‌ ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా అనన్య పాండే చూపు తిప్పనివ్వడం లేదు అంటూ నెటిజన్స్‌ తెగ కామెంట్స్ చేస్తున్నారు.


ఈ ఫోటోల్లో అనన్య పాండే ఇంతకు ముందు కంటే చాలా అందంగా కనిపిస్తుందని నెటిజన్స్‌తో పాటు ఆమె ఫాలోవర్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. సన్నగా నాజూకుగా ఉండే అనన్య పాండే ముందు ముందు బాలీవుడ్‌లో టాప్‌ స్టార్‌ హీరోయిన్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అనన్య పాండేకి అందంతో పాటు నటన ప్రతిభ ఉంది. అందుకే ఆమె బాలీవుడ్‌లో ఈమె సరైన హిట్స్‌ పడకున్నా ఆఫర్లను అందుకుంటుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2019 నుంచి సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు తక్కువ సమయంలోనే మంచి పేరును సొంతం చేసుకుంది. అయితే నటిగా కమర్షియల్‌ హిట్‌ కోసం వెయిట్‌ చేస్తోంది.


రొమాంటిక్ కామెడీ మూవీ స్టూడెంట్‌ ఆఫ్ ది ఇయర్‌ 2 లో నటించడం ద్వారా తన నటన ప్రతిభను కనబర్చే అవకాశం ను దక్కించుకున్న అనన్య పాండే ఆ తర్వాత పలు సినిమాల్లోనూ నటించింది. తాజాగా ఈమె కేసరి చాప్టర్‌ 2 సినిమాలో నటించింది. ఆ సినిమా కమర్షియల్‌గా ఫ్లాప్‌ అయినప్పటికీ నటిగా అందులో పర్వాలేదు అనిపించింది. ప్రస్తుతం ఈమె చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. వాటితో అయినా ఈమె కమర్షియల్‌ విజయాన్ని సొంతం చేసుకుంటుందేమో చూడాలి. ఇలాంటి అందమైన రూపం ఉన్న అనన్య పాండేకు లక్‌ కలిసి రాకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ఆఫర్లు దక్కడం లేదు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News