రోమాంచకంపై హీరోయిన్ కాన్ఫిడెన్స్.. ఏ స్థాయిలో ఉందంటే..

సెప్టెంబర్ 3న రాబోతున్న రోమాంచకం సినిమా ప్రమోషన్స్ లో హీరోయిన్ అనంతిక సనిల్‌కుమార్ తన స్పీచ్ తో అందరినీ ఎట్రాక్ట్ చేశారు.

Update: 2026-08-21 17:07 GMT

సెప్టెంబర్ 3న రాబోతున్న రోమాంచకం సినిమా ప్రమోషన్స్ లో హీరోయిన్ అనంతిక సనిల్‌కుమార్ తన స్పీచ్ తో అందరినీ ఎట్రాక్ట్ చేశారు. తన కెరీర్ కు ఈ కథ ఎలా సెట్ అయ్యిన విధానం, అలాగే సెట్స్ లో హీరో సుమంత్ ప్రభాస్ తో కొనసాగిన జర్నీ గురించి సరదాగా తెలియజేశారు. ఎనిమిది వసంతాలు సినిమా తర్వాత తాను చాలా కథలు విన్నానని, కానీ దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి చెప్పిన ఈ కథకు వెంటనే కనెక్ట్ అయ్యానని అనంతిక తెలిపారు.

ఒక నటిగా అన్ని రకాల ఎమోషన్స్ ట్రై చేయాలని ఉంటుందని, ఆ స్కోప్ ఈ సినిమాలో తనకు దొరికిందని అన్నారు. ఇది పూర్తిగా తన స్టైల్ సినిమా అని కాన్ఫిడెంట్ గా చెప్పారు. భద్రకాళి పిక్చర్స్ లాంటి బ్యానర్ లో ప్రణయ్ రెడ్డి, సందీప్ రెడ్డి వంగాలతో కలిసి పనిచేయడం హ్యాపీగా ఉందని ఆమె వివరణ ఇచ్చారు. షూటింగ్ చేసినన్ని రోజులు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా కంఫర్టబుల్ గా వర్క్ చేశామని, మ్యూజిక్ డైరెక్టర్ వాసుకి వైభవ్ ఈవెంట్ కు రాలేకపోయినా, ఆయన ఇచ్చిన సాంగ్స్ చాలా బాగున్నాయని క్రెడిట్ ఇచ్చారు.

ఇక హీరో సుమంత్ ప్రభాస్ తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి కూడా అనంతిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మొదటి రోజు నుంచే సుమంత్ తో మంచి బాండింగ్ కుదిరిందని, సీన్స్ ఎలా చేయాలనే దానిపై ఇద్దరం బాగా ప్రాక్టీస్ చేశామని చెప్పారు. సెట్స్ లో అప్పటికప్పుడు ఏవైనా మార్పులు చేసినా, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ చాలా ఈజీగా ఆ సీన్స్ పూర్తి చేశామని వెల్లడించారు.

చివర్లో యాంకర్ అడిగిన ఒక ప్రశ్నకు అనంతిక ఇచ్చిన ఆన్సర్ అక్కడున్న వాళ్ళను నవ్వించింది. సుమంత్ చాలా నాటీ అని డైరెక్టర్ చెప్పారు కదా, మీరు చూస్తే డీసెంట్ కుర్రాడు అనుకున్నారు.. దీనిపై ఏమంటారు అని యాంకర్ అడగ్గా.. ఆమె నవ్వుతూ మే బీ అంటూ చాలా సేఫ్ ఆన్సర్ ఇచ్చింది. అనంతిక చెప్పిన విషయాలు చూస్తుంటే ఈ సినిమాలో ఈ పెయిర్ మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయినట్టు కనిపిస్తోంది.

ఇక సినిమా డీటెయిల్స్ విషయానికి వస్తే.. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుంచి వచ్చిన వేణుగోపాల్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లవ్ స్టోరీకి తోడుగా కామెడీ, సస్పెన్స్ ఎలిమెంట్స్ తో పక్కా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి వాసుకి వైభవ్ మ్యూజిక్ అందిస్తుండగా, పవన్ పప్పుల కెమెరా వర్క్ అందిస్తున్నారు. సెప్టెంబర్ 3న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News