హీరోయిన్‌ని బలవంతం చేసిన డైరెక్టర్!
తాను నటించిన రెండు సినిమాలకే ఆయన ఈ సలహా ఇవ్వడంతో ఆశ్చర్యపోయానని తెలిపింది.;
అమీషా పటేల్ పరిచయం అవసరం లేదు. బద్రి, గదర్ ఏక్ ప్రేమ్ కథ, గదర్ 2 చిత్రాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్న ఈ బ్యూటీకి ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ సినిమాల నుంచి పదవీ విరమణ చేయమని సలహా ఇచ్చారట. తాను నటించిన రెండు సినిమాలకే ఆయన ఈ సలహా ఇవ్వడంతో ఆశ్చర్యపోయానని తెలిపింది.
కెరీర్ లో ఆరంభమే రెండు పీక్ హిట్స్ సాధించావు. ఇది లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్. ఇక సినిమాల్లో నటించాల్సిన అవసరం లేదని భన్సాలీ సూచించారట. అయితే సంజయ్ లీలా భన్సాలీ లాంటి కళాత్మక దర్శకుడితో, బాలీవుడ్ లో చాలామంది అగ్ర దర్శకనిర్మాతలతో తాను కలిసి పని చేయలేకపోవానికి కారణం తన మేనేజర్ తప్పిదాలు అని గుర్తు చేసుకుంది. మేనేజర్ పెద్ద దర్శకనిర్మాతలతో సత్సంబంధాలు కొనసాగించలేకపోవడం వల్లనే తాను కెరీర్ పరంగా గాడి తప్పానని అమీషా ఆవేదన చెందింది.
అయితే లేటువయసు ఘాటు భామ 40 ప్లస్ లో ఇలా కలత చెందినా ఎలాంటి ప్రయోజనం లేదని గుర్తించడం లేదు ఎందుకనో. భన్సాలీ సరైన సలహానే ఇచ్చాడు. కానీ దానిని ఎందుకు పాటించలేదు? అని నిలదీస్తున్నారు నెటిజనులు. వయసు అయిపోయినా ఇంకా యువకథానాయికలతో పోటీపడాలనుకోవడం, కంటి కింద వలయాలు, క్యారీ బ్యాగులతో యువహీరోల సరసన నటించాలనుకోవడం సరికాదని సూచిస్తున్నారు. అమీషా పటేల్ నటించిన గదర్ 2 గ్రాండ్ సక్సెసైనా బాలీవుడ్ లో సరైన అవకాశాలు రావడం లేదు. దీంతో పొరుగు భాషలైన మరాఠా సహా ఇతర పరిశ్రమల్లో తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల సొంత బ్యానర్ పెట్టి సినిమాలు నిర్మించేందుకు ఈ బ్యూటీ సిద్ధమైంది.