ఫలక్‌నుమా దాస్ తర్వాత మళ్లీ ఆ రేంజ్ రా కంటెంట్.. 'లిటిల్ హార్ట్స్' డైరెక్టర్ కామెంట్స్!

ఎంతో బిజీ ఆర్కిటెక్ట్ అయిన ఆయన, సినిమాపై ఉన్న ప్యాషన్‌తో ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్ట్ చేయడం గ్రేట్ అని ప్రశంసించారు.

Update: 2026-08-13 17:57 GMT

యూత్‌ఫుల్ నేటివిటీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న 'అమీర్ లోగ్' సినిమా ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ‘లిటిల్ హార్ట్స్’ చిత్ర దర్శకుడు సాయి మార్తాండ్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ వేడుకలో పాల్గొని సినిమా టీమ్‌కి తన బెస్ట్ విషెస్ తెలియజేశారు.

ఈవెంట్ లో సాయి మార్తాండ్ మాట్లాడుతూ, ఈ వేడుకకు రావడం తనకు చాలా స్పెషల్ అని చెప్పారు. తన ఫస్ట్ లుక్ పోస్టర్ డిజైన్ చేసిన శక్తి గారితో పాటు, ఇందులో నటించిన హరితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఒక ప్రాజెక్ట్ సమయంలో చాలా షార్ట్ టైమ్‌లో వచ్చి తమకు ట్యూన్ రాసి, పాడి హెల్ప్ చేసిన హరి.. ఇప్పుడు అమీర్ లోగ్ సినిమాలో మెయిన్ లీడ్స్ లో ఒకడిగా చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.

ఈ సినిమా మ్యూజిక్ చాలా బాగుందని, మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ సాయి వర్క్ కి తాను పెద్ద ఫ్యాన్ అని చెప్పారు. అలాగే ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి తనకు కాల్ చేసి డైరెక్టర్ రమణారెడ్డి గురించి చెప్పిన విషయాన్ని పంచుకున్నారు. ఎంతో బిజీ ఆర్కిటెక్ట్ అయిన ఆయన, సినిమాపై ఉన్న ప్యాషన్‌తో ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్ట్ చేయడం గ్రేట్ అని ప్రశంసించారు. అంతేకాకుండా లైన్ ప్రొడ్యూసర్ క్యాంప్ శశి తనకు ట్విట్టర్ ఫ్రెండ్ అని, ఆయన విజన్ తనకు ఇన్స్పిరేషన్ అని తెలిపారు.

గతంలో ఫలక్‌నుమా దాస్ సినిమా ఎంత రాగా, రియలిస్టిక్ గా ఉందో.. ఫ్యూ ఇయర్స్ తర్వాత మళ్లీ ఆ రేంజ్ కంటెంట్ అమీర్ లోగ్ లో కనిపిస్తోందని సాయి మార్తాండ్ అన్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కచ్చితంగా పక్కా వర్కౌట్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తమ 'లిటిల్ హార్ట్స్' ప్రాజెక్ట్ కి సపోర్ట్ చేసిన వంశీ నందిపాటి, బన్నీ వాస్, పుంజు బ్రో, శక్తిలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు.

చిన్న సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ చాలా అవసరమని, థియేటర్లకు వచ్చి ఈ సినిమాను పెద్ద హిట్ చేయాలని కోరారు. రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా ప్రెజెంట్ చేస్తున్న ఈ చిత్రంలో ఎంసీ హరి, మనోజ్, శశిధర్, వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, యోగి కీలక పాత్రల్లో నటించారు. స్మరణ్ సాయి మ్యూజిక్ అందించిన ఈ హైదరాబాదీ ఫన్ రైడ్ నెక్స్ట్ వీక్ థియేటర్లలోకి రానుంది.

Tags:    

Similar News