• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అతనికి ఇచ్చిన మాట...

అతనికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మాస్ మహారాజ్..!

| మాస్ మహరాజ్ రవితేజ మాట ఇచ్చాడంటే చేసి తీరుతాడంటే అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు

By - Tupaki Desk
Update: 2024-05-15 03:30 GMT

మాస్ మహరాజ్ రవితేజ మాట ఇచ్చాడంటే చేసి తీరుతాడంటే అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. తన కెరీర్ మొదటి నుంచి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిన రవితేజకు తనని చూసి ఎంతోమంది స్పూర్తి పొందేలా చేసుకున్నాడు. ఇక తనని అభిమానించే వారికైతే తను ఎప్పుడు సపోర్ట్ గా ఉంటూ వచ్చాడు. సినీ పరిశ్రమలో సెలబ్రిటీస్ కు సెలబ్రిటీ ఫ్యాన్స్ ఉంటారు. అలా రవితేజకు కూడా చాలామంది సెలబ్రిటీ ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి వారిలో స్మాల్ స్క్రీన్ హీరో అమర్ దీప్ ఒకడు.

బుల్లితెర మీద అమర్ దీప్ మంచి యాక్టర్. చాలా సీరియల్స్ లో మెయిన్ లీడ్ గా నటించాడు. అయితే అతని అభిమాన నటుడు మాస్ మహరాజ్ రవితేజ. మాస్ రాజాని చూస్తే చాలు అమర్ దీప్ హై ఓల్టేజ్ కరెంట్ తీగలా ఎనర్జిటిక్ గా మారిపోతాడు. సీరియల్స్ ద్వారా వచ్చిన క్రేజ్ తో బిగ్ బాస్ సీజన్ 7 లో అమర్ దీప్ హౌస్ లోక్కి వచ్చాడు. హౌస్ లో తన ఆటలతో.. అల్లరితో సందడి చేశాడు.

సీజన్ 7 రన్నరప్ గా నిలిచిన అమర్ దీప్ రవితేజ తో నటించాలని ఉందన్న కోరిక హోస్ట్ నాగార్జునకు చెప్పాడు. ఫైనల్ ఎపిసోడ్ లో అమర్ దీప్ ని హౌస్ నుంచి ఎలిమినేట్ అయితే రవితేజ ఛాన్స్ ఇస్తానని చెప్పాడు. అయితే క్షణం ఆలోచించకుండా అమర్ దీప్ బయటకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. అప్పుడే రవితేజ తన నెక్స్ట్ సినిమాలో అమర్ దీప్ కి ఆఫర్ ఇస్తానని చెప్పాడు. అలానే ఇచ్చిన మాట ప్రకారంగానే మాస్ రాజా ప్రస్తుతం చేస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాలో అమర్ దీప్ కి ఛాన్స్ ఇచ్చాడు.

సినిమా షూటింగ్ లో పాల్గొన్న అమర్ దీప్ రవితేజతో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఫోటోతో పాటుగా ఇన్నాళ్లకు నా కల నెరవేరింది. నా దేవుడు నువ్వేనయ్యా.. ఫ్యాన్ బోయ్ మూమెంట్ అంటూ రవితేజతో దిగిన ఫోటో షేర్ చేశాడు అమర్ దీప్. సో మొత్తానికి రవితేజ సినిమాలో అమర్ దీప్ కనిపించబోతున్నాడు. బిగ్ బాస్ తర్వాత సినిమా చాన్సులు కామనే అయితే స్మాల్ స్క్రీన్ వదిలి వెళ్లాలంటే మాత్రం రిస్క్ చేయాల్సిందే. మరి అమర్ దీప్ సిల్వర్ స్క్రీన్ పైన తన సత్తా చాటుతాడేమో చూడాలి.

Tags:    
  • Raviteja 
  • Biggboss7 
  • Biggbosstelugu 
  • Amardeepchowdary 
  • Mrbachchan 
  • Harishshankar 
  • Filmindutry 
  • Tollywood 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS