ఏఎం రత్నం.. కింకర్తవ్యం?

ఒకప్పుడు సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్లలో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు ఏఎం రత్నం. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి దయనీయంగా మారింది.;

Update: 2025-08-19 17:30 GMT

ఒకప్పుడు సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్లలో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు ఏఎం రత్నం. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి దయనీయంగా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డేట్లు ఇచ్చాడని ఎంతో ఎగ్జైట్ అయి పాన్ ఇండియా స్థాయిలో ఓ భారీ చిత్రం చేయడానికి ఆయన తలపెట్టిన ప్రయత్నం.. చివరికి ఆయన పునాదులను కదిలించేసింది. ‘హరిహర వీరమల్లు’ సినిమా ఎంతకీ పూర్తి కాక.. చివరికి అతి కష్టం మీద మమ అనిపించారు.

ఎన్నో ఇబ్బందులను దాటి, భారీ డెఫిషిట్‌తో సినిమాను రిలీజ్ చేస్తే.. బాక్సాఫీస్ దగ్గర అది దారుణంగా బోల్తా కొట్టింది. పెట్టిన బడ్జెట్‌తో పోలిస్తే సినిమాను అమ్మిందే తక్కువ రేట్లకు. ఇప్పుడు చూస్తే బయ్యర్లు ఆ మొత్తాల్లో కూడా సగానికి మించి రికవర్ కాక తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. తమ నష్టాలను భర్తీ చేయాలంటూ నిర్మాత ఏఎం రత్నంను డిమాండ్ చేస్తున్నారట.

ఇప్పటిదాకా ఫోన్లలో రాయబారం నడిపిన వివిధ ప్రాంతాల బయ్యర్లు.. ఇప్పుడు హైదరాబాద్ చేరుకుని ఫిలిం ఛాంబర్లో పంచాయితీకి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. నష్టాలన్నీ భరించకపోయినా కనీసం జీఎస్టీల వరకు అయినా ఇవ్వాలన్నది వాళ్ల డిమాండ్ అట. సినిమాను కొన్న బయ్యర్లు నష్టపోతే.. భర్తీ చేయాలనే నియమం ఏమీ లేదు.

కానీ 50 శాతానికి మంచి నష్టపోతే.. వాళ్లకు కొంత మేర అయినా సెటిల్ చేయాలన్నది అనధికారిక నిబంధన. అలా చేయకపోతే నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య ట్రస్ట్ దెబ్బ తింటుంది. అందుకే ఇలాంటి పంచాయితీల్లో సినీ పెద్దలు జోక్యం చేసుకుంటూ ఉంటారు. ఐతే రత్నం ఆల్రెడీ ‘హరిహర వీరమల్లు’ వల్ల దారుణంగా దెబ్బ తిన్నారు. ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చిందంటున్నారు. అలాంటపుడు నష్టాల భర్తీకి ఆయనేం చేయగలరు అన్నది ప్రశ్న. మరి ఈ పంచాయితీ ఎలా తీరుతుందో చూడాలి.

Tags:    

Similar News