OG డామినేషన్ పై వీరమల్లు నుంచి స్వీట్ కౌంటర్
ఇదిలా ఉంటే, ప్రెస్‌మీట్ తర్వాత ఎ.ఎం. రత్నం తనదైన స్టైల్‌లో ఒక వివరణ ఇచ్చారు.;
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలంటే అభిమానులకు ఎప్పుడూ ప్రత్యేకమే. లేటెస్ట్ గా ‘హరి హర వీరమల్లు’ సినిమా రిలీజ్ దగ్గరపడుతుండటంతో, ప్రమోషన్ జోష్ మరింత పెరిగింది. ముఖ్యంగా పవన్ స్వయంగా మీడియా ముందుకొచ్చారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరికీ దగ్గర చేయాలనే ఉద్దేశంతో పవన్ ప్రత్యేకంగా ప్రమోషన్ లో పాల్గొనడం విశేషం. పవన్ మీడియాతో మాట్లాడటం చాలా అరుదుగా జరుగుతుంది. కానీ ఈసారి నిర్మాత ఎ.ఎం. రత్నం కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించడం విశేషం.
పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మీడియా మీట్ ఎందుకు ఏర్పాటు చేశారన్నది అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. అయితే పవన్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయడానికి అసలు కారణం సినిమా కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న నిర్మాత రత్నంకు మద్దతుగా నిలబడటమే అని చెప్పారు. రత్నం ఎంతో కష్టపడి సినిమా రిలీజ్‌కి రేంజ్ తీసుకొచ్చేలా పని చేస్తున్నారని, ఎంత బిజీగా ఉన్నా ఆయన్ను సపోర్ట్ చేయడమే నా నెక్స్ట్ వర్క్ అంటూ పవన్ క్లారిటీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే, ప్రెస్‌మీట్ తర్వాత ఎ.ఎం. రత్నం తనదైన స్టైల్‌లో ఒక వివరణ ఇచ్చారు. "పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రెస్‌మీట్ నిర్వహించి సినిమా గురించి మాట్లాడటాన్ని నేను ఎంతో సంతోషంగా భావిస్తున్నాను. ఇంతవరకు ఆయన ఇలా ముందుగా మీడియాతో మాట్లాడలేదు. ఈసారి మాత్రం నా కోసం వచ్చారు. నిజంగా ఇది నాకు చాలా పెద్ద విషయం" అంటూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే OG OG అంటూ ఫ్యాన్స్ సౌండ్స్ పై కూడా చాలా సింపుల్ గా ఒక వివరణ ఇచ్చారు.
‘‘పవన్‌గారి మరో సినిమా OG గురించిన హైప్ చూస్తుంటే, అంతా OG OG అంటూ మంత్రంలా జపిస్తున్నారు. కానీ మా సినిమాకు పెద్ద పేరు ఉండటంతో అందరికీ గుర్తు పెట్టుకోవడం కష్టమవుతుందని నేను అనుకుంటున్నాను. కనీసం మా సినిమాకు ‘వీరా వీరా’ అంటూ ఫ్యాన్స్ కూడా సింపుల్‌గా మంత్రంలా జపిస్తే బాగుండేదని అనిపించేది’’ అంటూ నవ్వులు పూయించారు. ఇది వినగానే అక్కడున్న వారందరూ ఎంజాయ్ చేశారు.
ఇకపోతే, పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో, క్రిష్-జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హరి హర వీరమల్లు’ సినిమా జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొఘల్ టైమ్ పిరియాడ్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక దాదాపు బిజినెస్ డీల్స్ కు సంబంధించిన అన్ని పనులు ఫినిష్ అయ్యాయి. తప్పకుండా సినిమా అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు.