• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బన్నీ న్యూ లుక్స్​.. ఇలా...

బన్నీ న్యూ లుక్స్​.. ఇలా చూస్తే ఏ అమ్మాయైనా పడిపోవాల్సిందే

| ఆగస్ట్ కవర్ ఆఫ్ ది 'ట్రావెల్ అండ్​ లీజర్' బ్రాండ్​కు సంబంధించి ఓ స్పెషల్ ఫొటోషూట్​లో మైండ్​ బ్లోయింగ్​ అనేలా కనిపించారు.

By - Tupaki Desk
Update: 2023-08-12 11:17 GMT

అల్లు అర్జున్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే! ఎందుకంటే ఆయనో ట్రెండ్ సెట్టర్. సినిమా సినిమాకి లుక్స్​ మారుస్తూ.. సరికొత్త ట్రెండ్స్‌ను సృష్టిస్తుంటారు. అలా కేవలం యాక్టింగ్​, డ్యాన్స్​లో మాత్రమే కాదు లుక్స్​ పరంగానూ ఎప్పటికప్పుడు వైవిధ్యంగా కనిపిస్తూ టాలీవుడ్ యూత్ ఫ్యాషన్​ ఐకాన్​గా మారారు. స్టైల్‌కు కేరాఫ్ అడ్ర‌స్​గా నిలిచారు. అందుకే అభిమానులు ముద్దుగా స్టైలిష్ స్టార్​ అనే ట్యాగ్​ లైన్​తో పిలుస్తుంటారు.


కాస్టూమ్స్ ద‌గ్గ‌ర్నుంచి హెయిర్ స్టైల్ వ‌ర‌కు ఎప్పుడూ విభిన్న‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తూ ఉంటారు బన్నీ. ఎప్పుడూ కూల్​, కిల్లర్ అండ్ స్టైలిష్​ లుక్స్​తో అభిమానులను ఆకట్టుకుంటుంటారు. అలా త‌న స్టైలిష్ లుక్స్‌తో ఇటు సౌత్ ఇండియాతో పాటు బాలీవుడ్‌లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.


ఇప్పుడాయన​ పాన్ ఇండియా రేంజ్​లో క్రేజ్​ దక్కించుకుని ఐకాన్​ స్టార్​గా ఎదిగిపోయారు. తాజాగా మరో అదిరిపోయే లుక్​లో కనిపించి ఫ్యాన్స్​ను ఫిదా చేసేశారు. ఆగస్ట్ కవర్ ఆఫ్ ది 'ట్రావెల్ అండ్​ లీజర్' బ్రాండ్​కు సంబంధించి ఓ స్పెషల్ ఫొటోషూట్​లో మైండ్​ బ్లోయింగ్​ అనేలా కనిపించారు.


లాంగ్ హెయిర్​, గుబురు గడ్డం, కలర్​ఫుల్​ ఔట్​ఫిట్​లో రాకింగ్​గా అదిరిపోయారు. మల్టీకలర్ షర్ట్​, బ్లూ​ కలర్ ప్యాంట్​, స్టైలిష్ కళ్లజోడు, షూస్​ ధరించి మెస్మరైజ్ చేశారు. ఇంకో ఫొటోలో రింగుల జుట్టులో గ్రీన్​ కలర్ లీఫీ డిజైన్​ డబుల్​ షర్ట్​లో ఫిదా చేశారు.​ మిగతా ఫొటోస్​లోనూ రకరకాల కూల్​ అండ్ స్టైలిష్ మ్యాచింగ్​ ఔట్​ఫిట్స్​ ధరించారు. టాప్​ టు బాట్​మ్​ అదిరిపోయారు. అసలీ ఈ పిక్స్​లోని బన్నీ స్టైల్​, యాటిట్యూడ్​ చూసిన ఇండియా వైడ్​ అమ్మాయిలైతే ఈ ఫొటోలను తెగ షేర్ చేస్తున్నారు.

ఇకపోతే బన్నీ ప్రస్తుతం.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతో ఎదురుచూస్తున్న సినిమా 'పుష్ప2' నటిస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్​ భాషతో సంబంధం లేకుండా పుష్ప మేనరిజమ్‌తోనూ, డైలాగ్‌తోనూ ప్రపంచం మొత్తం ఊగిపోయింది. దానిని దృష్టిలో ఉంచుకుని సెకండ్ పార్ట్​ను అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించడంతోపాటు, ఒకేసారి పలు భాషల్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్​.

Tags:    
  • Tollywood 
  • Iconstar 
  • Alluarjun 
  • Newlook 
  • Travelleisure 
  • Photoshoot 
  • Phototalk 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS