స్ఫూర్తివంతం.. చిరంజీవి అత్తగారి నేత్రదానం
ఈరోజు తెల్లవారుజామున మా అత్తగారు ఇక లేరు అనే వార్త వచ్చిన వెంటనే నేను అరవింద్ తో ఫోన్ లో మాట్లాడాను.;
నేత్రదానం, రక్తదానం గురించి,.. తలసేమియా రోగులకు రక్తం తక్షణ అవసరం గురించి మెగాస్టార్ చిరంజీవి చేసినంత ప్రచారం ఇంకెవరూ చేయరేమో! ఎందరు బురద జల్లినా మొక్కవోని ధీక్షతో తన పని తాను చేసుకుపోతున్నారు చిరంజీవి. నేత్రదానం విషయంలోను ఆయన నిబద్ధత ఎలాంటిదో తాజా ఘటన సాక్ష్యంగా నిలిచింది. శనివారం వేకువ ఝామున చిరంజీవి అత్తగారైన శ్రీమతి అల్లు కనకరత్నం గారు (అల్లు రామలింగయ్య సతీమణి) ఇక లేరు అని తెలిసిన వెంటనే వేకువజామున చాలా డ్రామా నడించింది. దీని గురించి చిరంజీవి సంతాప సభలో చెప్పిన సంగతులు ఆశ్చర్యపరిచాయి. అదే సమయంలో అందరిలో స్ఫూర్తిని నింపాయి.
ఈరోజు తెల్లవారుజామున మా అత్తగారు ఇక లేరు అనే వార్త వచ్చిన వెంటనే నేను అరవింద్ తో ఫోన్ లో మాట్లాడాను. ఒక సందర్భంలో మా అమ్మ గారు, అత్తగారు సమక్షంలో నేత్రదానం గురించి చర్చించాను. ఆ సమయంలో మీరు నేత్రదానం చేస్తారా? అని అడిగితే అత్తమ్మ గారు ఏమన్నారంటే..! కట్టె కాలి బూడిదైపోయేదే కదా.. తప్పకుండా నేత్రదానం చేస్తాను! అని అన్నారు.. అని చిరు తెలిపారు.
2.30 గం.లకు అల్లు అరవింద్ గారికి ఫోన్ చేస్తే తప్పనిసరిగా నేత్రాలను డొనేట్ చేస్తామని అన్నారు. దానికి సాక్ష్యంగా అంటూ మెగాస్టార్ చిరంజీవి కనకరత్నమ్మ గారు ఐ డొనేషన్ వేళ ఆస్పత్రి ఫోటోలను కూడా చూపించారు. తెల్లవారుజామున ఆస్పత్రి స్టాఫ్ అందుబాటులో ఉన్నారని తెలిపారు. శనివారం మధ్యాహ్నం కనకరత్నమ్మ అంత్యక్రియలను చిరంజీవి దగ్గరుండి జరిపించారు. పాడె మోసి అత్తమ్మ రుణం తీర్చుకున్నారు చిరు.