"అమెరికన్స్ గాట్ టాలెంట్ షో"లో పుష్ప సాంగ్.. పర్ఫామెన్స్ దెబ్బకు దద్దరిల్లిన ఆడిటోరియం!

అల్లుఅర్జున్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో 2021లో విడుదలైన చిత్రం పుష్ప.. అల్లు అర్జున్ కెరియర్ లోనే తొలి పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ సినిమా సంచలనం సృష్టించింది.;

Update: 2025-08-04 10:26 GMT

అల్లుఅర్జున్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో 2021లో విడుదలైన చిత్రం పుష్ప.. అల్లు అర్జున్ కెరియర్ లోనే తొలి పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ సినిమా సంచలనం సృష్టించింది. దీనికి తోడు ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకున్నారు. అంతేకాదు నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డు కూడా సృష్టించారు అల్లు అర్జున్. పుష్ప: ది రైజ్ అంటూ విడుదలైన ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటించగా.. తొలిసారి స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్ లో నర్తించి అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రముఖ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా ఆకట్టుకున్నారు. అటు అనసూయ, సునీల్, అజయ్ ఘోష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

ఇకపోతే తగ్గేదేలే అనే సిగ్నేచర్ డైలాగ్ తో పాటు ప్రతి పాట కూడా ప్రేక్షకుడిని ఆకట్టుకున్నాయి. అల్లు అర్జున్ నటన, సుకుమార్ టేకింగ్ తో పాటు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ సినిమాను మరో స్థాయికి చేర్చాయి. ఇకపోతే ఈ సినిమా విడుదలై 4ఏళ్లు అవుతున్నా.. ఇంకా పుష్ప మేనియా తగ్గలేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా హవా ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో ఒక వెలుగు వెలుగుతోంది. తాజాగా అమెరికన్స్ ఘాట్ టాలెంట్ షోలో ఈ సినిమా మ్యూజిక్ ప్రదర్శితమవడం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అసలు విషయంలోకి వెళ్తే.." అమెరికన్స్ గాట్ టాలెంట్ "షో గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. వివిధ రంగాలలో ప్రతిభ ఉన్న వాళ్ళు ఇక్కడ ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే భారత్ నుంచి "బీ యూనిక్ క్ర్యూ" బృందం పుష్ప మూవీ మ్యూజిక్ కి తమదైన శైలిలో ప్రదర్శన ఇచ్చి అక్కడున్న జడ్జిలనే కాదు ఆడిటోరియంలో షో చూస్తున్న వాళ్లను కూడా మెస్మరైజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని పుష్ప టీమ్ అలాగే అల్లు అర్జున్ కూడా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ గా మారుతోంది. మొత్తానికైతే ఆ బృందం అద్భుతమైన మూమెంట్స్ తో పుష్ప మ్యూజిక్ కి ఇచ్చిన పర్ఫామెన్స్ కి ఆడిటోరియం మొత్తం దద్దరిల్లిపోయిందని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం నిజంగా ప్రశంసనీయమని చెప్పాలి

ఇక ఈ సినిమా తర్వాత మళ్లీ ఈ సినిమా సీక్వెల్ గా పుష్ప 2 రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టి రికార్డు సృష్టించింది. ముఖ్యంగా రూ. 1800 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి.. దంగల్ సినిమా రికార్డులను బ్రేక్ చేయాలని చూసింది. కానీ సాధ్యపడలేదు.. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్.. అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.

Tags:    

Similar News