జపాన్ లో పుష్ప-2.. బన్నీ క్రేజ్ మామూలుగా లేదుగా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప-2 మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే.;
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప-2 మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రవిశంకర్ యలమంచిలి, నవీన్ ఎర్నేని గ్రాండ్ గా నిర్మించారు. 2024లో రిలీజ్ అయిన ఆ సినిమా.. భారీ వసూళ్లను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1800 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి అనేక రికార్డులు బద్దలు కొట్టింది.
అయితే ఇప్పుడు పుష్ప-2 జపాన్ లో జనవరి 16వ తేదీన పెద్ద ఎత్తున రిలీజ్ అయింది మూవీ. పుష్ప కున్రిన్ పేరుతో విడుదల చేశారు మేకర్స్. అక్కడి ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థల సహకారంతో దాదాపు 250 థియేటర్లలో సినిమాను ప్రదర్శించారు. ఒక ఇండియన్ కమర్షియల్ మూవీ ఇంత పెద్ద స్థాయిలో జపాన్‌లో విడుదల కావడం విశేషమనే చెప్పాలి.
అదే సమయంలో పుష్ప-2 ప్రమోషన్స్ కోసం కొన్ని రోజుల క్రితమే అల్లు అర్జున్ జపాన్ వెళ్లారు. రష్మిక మందన్న కూడా వెళ్లారు. వారిద్దరితో పాటు ప్రముఖ నిర్మాతలు బన్నీ వాసు, రవిశంకర్ యలమంచిలి ఉన్నారు. అయితే విమానాశ్రయంలోనే పెద్ద సంఖ్యలో అభిమానులు చేరి వారందరికీ ఘన స్వాగతం పలికారు.
ఇక రీసెంట్ గా జపాన్ రాజధాని టోక్యోలో పుష్ప 2 మూవీ ప్రీమియర్ వేశారు. అందులో బన్నీ, రష్మిక పాల్గొనగా.. హాల్ అంతా నిండిపోయింది. పెద్ద ఎత్తున జపాన్ మూవీ లవర్స్ తరలివచ్చారు. అయితే వేడుకలో అల్లు అర్జున్ జపనీస్ భాషలో పుష్ప డైలాగ్ చెప్పడంతో ఒక్కసారిగా హాల్ మొత్తం చప్పట్లు, ఈలలతో మార్మోగిపోయింది. అభిమానులు గట్టిగా కేకలు వేయడంతోపాటు విజిల్స్ వేయడంతో పండుగ వాతావరణం నెలకొంది.
రష్మిక కూడా వేడుకలో మాట్లాడగా.. అందరూ చప్పట్లతో హోరెత్తించారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తం మూమెంట్స్ ను చిన్న గ్లింప్స్ రూపంలో అల్లు అర్జున్ టీమ్ పోస్ట్ చేయగా.. అందరినీ ఆకట్టుకుని సందడి చేస్తోంది. ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతున్న వీడియో ద్వారా మరోసారి బన్నీ థ్యాంక్స్ చెప్పారు. టోక్యో నిజంగా చాలా స్పెషల్ అని, అందరి ప్రేమకు ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చారు.
అదే సమయంలో వీడియోపై సినీ ప్రియులు, అభిమానులు రెస్పాండ్ అవుతున్నారు. అల్లు అర్జున్ కు జపాన్ లో మామూలు క్రేజ్ లేదు కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే జపాన్ ప్రేక్షకులు భారతీయ సినిమాలను చాలా ఇష్టపడతారు. అందుకే పుష్ప కున్రిన్ అక్క మంచి రెస్పాన్స్ అందుకుంటుందని నమ్మకం వ్యక్తమవుతోంది. మరి జపాన్ లో ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాలి.