బన్నీ వేటలో దర్శకుల ఆట.. ఎంతమందంటే?

ఇక ఫ్యూచర్ లైనప్ విషయానికి వస్తే, ఇప్పటికే రెండు క్రేజీ ప్రాజెక్టులపై అఫీషియల్ క్లారిటీ ఉంది.;

Update: 2025-11-28 10:30 GMT

'పుష్ప 2' సృష్టించిన సునామీ ఇంకా ఎవరూ మర్చిపోలేదు. గత ఏడాది చివరలో వచ్చి బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 1700 కోట్లు కొల్లగొట్టి, ఇండియన్ సినిమా సత్తాను ప్రపంచానికి చాటింది. ఆ కనీవినీ ఎరుగని విజయంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ అమాంతం మారిపోయింది. ఇప్పుడు ఆయన వేసే ప్రతి అడుగుపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బన్నీ తన తర్వాతి సినిమాలను ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం బన్నీ ఫోకస్ మొత్తం అట్లీ సినిమా మీదే ఉంది. ఇది కేవలం పాన్ ఇండియా సినిమా కాదు, ఒక 'పాన్ వరల్డ్' ప్రాజెక్ట్. దాదాపు 700 కోట్ల భారీ బడ్జెట్ తో, హాలీవుడ్ కనెక్షన్ తో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 'జవాన్'తో షారుఖ్ కు బ్లాక్ బస్టర్ ఇచ్చిన అట్లీ, ఇప్పుడు బన్నీని గ్లోబల్ ఆడియన్స్ కు పరిచయం చేయడానికి ఒక విజువల్ వండర్ ను సిద్ధం చేస్తున్నాడు.

ఇక ఫ్యూచర్ లైనప్ విషయానికి వస్తే, ఇప్పటికే రెండు క్రేజీ ప్రాజెక్టులపై అఫీషియల్ క్లారిటీ ఉంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, కల్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో సినిమాలు చేయబోతున్నట్లు ఇదివరకే అధికారిక ప్రకటనలు వచ్చాయి. అనౌన్స్ మెంట్ పోస్టర్స్ కూడా రిలీజ్ చేసి హైప్ పెంచారు. అట్లీ సినిమా తర్వాత వీటిలో ఏది ముందు పట్టాలెక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ రెండు కాంబినేషన్లు బాక్సాఫీస్ దగ్గర మినిమమ్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.

అయితే బన్నీ కోసం క్యూ కట్టిన వారిలో ఇంకా చాలామంది దిగ్గజాలు ఉన్నారు. సంజయ్ లీలా భన్సాలీ, ప్రశాంత్ నీల్, బేసిల్ జోసెఫ్, సురేందర్ రెడ్డి, బోయపాటి శ్రీను.. ఇలా చాలామంది బన్నీకి కథలు వినిపించారు. కానీ ఇవన్నీ కేవలం స్క్రిప్ట్ చర్చల దశలోనే ఉన్నాయి. 'పుష్ప 2' ఇచ్చిన బూస్ట్ తో బన్నీ కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పాన్ వరల్డ్ రేంజ్ లో కంటెంట్ ఉంటే తప్ప గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.

ఈ లిస్టులో ఇప్పుడు కోలీవుడ్ సెన్సేషన్ లోకేష్ కనకరాజ్ పేరు సడెన్ గా తెరపైకి వచ్చింది. మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న ఈ కాంబినేషన్ పై ఇప్పుడు ఇండస్ట్రీలో జోరుగా చర్చ జరుగుతోంది. వీరిద్దరి మధ్య చర్చలు తుది దశకు వచ్చాయని, ఏ క్షణమైనా ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి బిగ్ అప్డేట్ రావచ్చని గట్టిగా టాక్ వినిపిస్తోంది. లోకేష్ మార్క్ డార్క్ యాక్షన్, బన్నీ స్వాగ్ కలిస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం.

అల్లు అర్జున్ ప్లానింగ్ చూస్తుంటే.. రాబోయే ఐదేళ్లు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మరికొన్ని రికార్డులు బ్లాస్ట్ అయ్యేలా ఉన్నాయి. 1700 కోట్ల రికార్డును తన తర్వాతి సినిమాలతో తానే బద్దలు కొట్టుకునేలా పక్కా స్కెచ్ వేశారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న అట్లీ సినిమా, లైన్లో ఉన్న సందీప్, త్రివిక్రమ్, లోకేష్ ప్రాజెక్టులు.. ఇవన్నీ చూస్తుంటే ఐకాన్ స్టార్ గ్లోబల్ ఐకాన్ గా మారే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది.

Tags:    

Similar News