లోకల్ కాదు నేషనల్: రీ-రిలీజ్ ట్రెండ్‌లో సరికొత్త ‘ఐకాన్’ హిస్టరీ!
టాలీవుడ్ స్టార్ హీరోల పాత సినిమాలు 4K వెర్షన్‌లో రీ-రిలీజ్ అయి తెలుగు రాష్ట్రాల్లో రికార్డులు సృష్టించడం మనం చూస్తూనే ఉన్నాం.
టాలీవుడ్ స్టార్ హీరోల పాత సినిమాలు 4K వెర్షన్‌లో రీ-రిలీజ్ అయి తెలుగు రాష్ట్రాల్లో రికార్డులు సృష్టించడం మనం చూస్తూనే ఉన్నాం. గబ్బర్ సింగ్, ఖలేజా, బిల్లా లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పాత జ్ఞాపకాలను రీఫ్రెష్ చేశాయి. అయితే, టాలీవుడ్ స్టార్లు కేవలం లోకల్ మార్కెట్ రికార్డులపైనే ఫోకస్ పెడితే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం ఏకంగా నేషనల్ మార్కెట్ రీ-రిలీజ్ ట్రెండ్‌ను సెట్ చేస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఆ విశేషాలు చూద్దాం..
కేరళ బాక్సాఫీస్ వద్ద ‘హ్యాపీ’ కలకలం:
తెలుగులో ‘హ్యాపీ’ సినిమా ఆశించిన విజయం సాధించలేదు, యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకుంది. కానీ, 20 ఏళ్ల తర్వాత ఇప్పుడీ సినిమా కేరళలో రీ-రిలీజ్ అయి కేవలం నాలుగు రోజుల్లోనే కోటి రూపాయలు వసూలు చేయడం ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక అద్భుతం. ఇక అక్కడ మన టయర్ 1 స్టార్ల కొత్త సినిమాలకు కూడా ఈ స్థాయి ఓపెనింగ్స్ రావు. ఇక కొన్ని సెంటర్లలో అర్ధరాత్రి షోలు వేసినా వెయ్యి సీట్ల థియేటర్లు సైతం హౌస్‌ఫుల్ అయిపోవడం ట్రేడ్ వర్గాలకే మైండ్ బ్లాంక్ చేస్తోంది.
పుష్పరాజ్ ఇప్పుడు క్యూట్ లవర్ బాయ్:
ప్రస్తుతం నార్త్ ఇండియా అంతా అల్లు అర్జున్‌ను 'పుష్పరాజ్' లాంటి రగ్గడ్, రా మాస్ క్యారెక్టర్‌లో చూసి పిచ్చెక్కిపోతోంది. కానీ కేరళ ప్రేక్షకులకు మాత్రం బన్నీ అంటే ఒక క్యూట్ లవర్ బాయ్. ఇప్పుడు థియేటర్లలో వస్తున్న సినిమాలన్నీ ఎక్కువగా రా అండ్ రస్టిక్ గా ఉంటున్నాయి. ఇక ఈ టైంలో 20 ఏళ్ల నాటి ప్యూర్ రొమాంటిక్ కామెడీ ‘హ్యాపీ’ వారికి ఒక మంచి రిలీఫ్‌ను ఇచ్చింది. అందుకే కేరళ ఆడియన్స్ దీన్ని ఒక నోస్టాల్జిక్ సెలబ్రేషన్‌లా ఫీలవుతున్నారు.
యూట్యూబ్ జనరేషన్ థియేటర్ సెలబ్రేషన్స్:
'హ్యాపీ', 'ఆర్య' సినిమాలు థియేటర్లలోకి వచ్చినప్పుడు ఇప్పుడున్న జెన్-జీ ఆడియన్స్ ఇంకా పుట్టలేదు లేదా చాలా చిన్న పిల్లలు. వీరంతా ఈ సినిమాలను కేవలం టీవీల్లో, యూట్యూబ్ లోనే చూశారు. ఇప్పుడు ఆ కల్ట్ క్లాసిక్ సినిమాలను థియేటర్లలో ఎక్స్‌పీరియన్స్ చేసే ఛాన్స్ రావడంతో యూత్ అస్సలు వదులుకోవడం లేదు. థియేటర్లలో దేవిశ్రీ ప్రసాద్, యువన్ శంకర్ రాజా సాంగ్స్ వస్తుంటే డాన్సులు వేస్తూ, రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
‘ఆర్య’తో ప్యాన్-ఇండియా రీ-రిలీజ్ బెంచ్‌మార్క్:
'హ్యాపీ' ఇచ్చిన బూస్ట్‌తో ఇప్పుడు బన్నీ నెక్స్ట్ సినిమా 'ఆర్య'ను తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి భారీగా రీ-రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు మనం కొత్త సినిమాలకు మాత్రమే ప్యాన్-ఇండియా రిలీజ్ చూశాం. కానీ ఒక పాత సినిమాను మూడు భాషల్లో గ్రాండ్‌గా ప్రమోట్ చేసి రిలీజ్ చేయడం టాలీవుడ్‌లో ఇదే మొదటిసారి. ఇది అల్లు అర్జున్ నేషనల్ వైడ్ మార్కెట్ స్టామినాకు అసలైన నిదర్శనం.
తెలుగు రాష్ట్రాల సరిహద్దులు దాటి పాత సినిమాతో సరికొత్త రికార్డులు సృష్టించడం ఒక్క అల్లు అర్జున్‌కే సాధ్యమైంది. రీ-రిలీజ్ ట్రెండ్‌ను లోకల్ స్థాయి నుంచి నేషనల్ స్థాయికి తీసుకెళ్లిన ఐకాన్ స్టార్, టాలీవుడ్ బాక్సాఫీస్ హిస్టరీలో సరికొత్త రూట్‌ను క్రియేట్ చేశారు. ఇక రాబోయే 'ఆర్య' ప్యాన్-ఇండియా రీ-రిలీజ్ ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.