ఒక్క వీడియోతో రాకా రచ్చ.. ఇండియన్ సినిమా కొత్త యూనివర్స్‌కు ఇదే నాంది?

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న రాకా ఇటీవల మరోసారి చర్చనీయాంశమైంది.

Update: 2026-07-20 10:55 GMT

ఇండియ‌న్ సినిమా ఇప్పుడు మరో కీలక మలుపు తిరుగుతోంది. ఒకప్పుడు మైథాలజీ, చారిత్రక కథలు, భారీ పీరియాడిక్ సినిమాలే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులుగా భావించేవారు. అయితే గత కొన్నేళ్లుగా స్టార్ హీరోలు, స్టార్ డైరెక్ట‌ర్లు సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ, వరల్డ్ బిల్డింగ్ ఆధారిత సినిమాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ప్రేక్షకుల అభిరుచిలో వచ్చిన మార్పు, అంతర్జాతీయ మార్కెట్ విస్తరణ, అత్యాధునిక విజువల్ టెక్నాలజీ అందుబాటులోకి రావడం ఈ మార్పుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

ఈ తరహా సినిమాల్లో కథ ఎంత ముఖ్య మో, ఆడియ‌న్స్ ను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే విజువల్ డిజైన్ కూడా అంతే కీలకం. అందుకే మేకర్స్ ఇప్పుడు ప్రోస్తెటిక్ మేకప్, మోషన్ క్యాప్చర్, డిజిటల్ క్యారెక్టర్ డిజైన్, భారీ వీఎఫ్ఎక్స్ వంటి అంశాలపై భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఒక క్యారెక్ట‌ర్‌ కోసం యాక్ట‌ర్ లేదా ఆర్టిస్ట్ గంటల తరబడి మేకప్ చేయించుకోవడం, షూటింగ్ పూర్తయ్యాక అదే స్థాయిలో మేకప్ తొలగించడం కూడా ఈ ప్రక్రియలో భాగంగా మారింది. హాలీవుడ్‌లో ఎన్నో ఏళ్లుగా కనిపిస్తున్న ఈ విధానం ఇప్పుడు భారతీయ సినిమాల్లోనూ వేగంగా విస్తరిస్తోంది.

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న రాకా ఇటీవల మరోసారి చర్చనీయాంశమైంది. సినిమాకు సంబంధించిన అఫీషియ‌ల్ ఇన్ఫ‌ర్మేష‌న్ బయటకు రాకముందే, సోషల్ మీడియాలో వైరలైన ఒక వీడియో ఫ్యాన్స్ లో కొత్త చర్చకు తెరలేపింది. ఆ వీడియో చూశాక సినిమాలోని పాత్రల డిజైన్ ఎలా ఉండొచ్చన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఒక చిన్న విజువల్ క్లిప్ కూడా ప్రేక్షకుల్లో ఎంత ఆసక్తిని రేకెత్తించగలదో ఈ ఘటన మరోసారి నిరూపించింది.

అయితే ఇది కేవ‌లం రాకా సినిమాకే పరిమితమైన అంశం కాదు. భారీ బడ్జెట్ సినిమాల‌కు సంబంధించి లీకులు ఇప్పుడు సినీ ఇండ‌స్ట్రీకు పెద్ద సవాల్‌గా మారుతున్నాయి. షూటింగ్ స్పాట్‌లలో మొబైల్ ఫోన్లపై ఆంక్షలు, నాన్-డిస్క్లోజర్ డీల్స్, భారీ భద్రతా వ్యవస్థలు అమల్లో ఉన్నప్పటికీ, ఏదోక రూపంలో సమాచారం బయటకు వస్తూనే ఉంది. కొన్నిసార్లు చిన్న వీడియోలు, మరికొన్నిసార్లు ఫొటోలు లేదా కాన్సెప్ట్ ఆర్ట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. డిజిటల్ యుగంలో వందలాది మంది టెక్నీషియ‌న్లు, ఆర్టిస్టులు, సపోర్ట్ స్టాఫ్ కలిసి పని చేసే భారీ ప్రాజెక్టుల్లో పూర్తి గోప్యతను కాపాడటం రోజురోజుకూ క్లిష్టంగా మారుతోంది.

ఇక మరోవైపు, ఇలాంటి లీకులు సినిమాపై ఆసక్తిని పెంచుతాయా? లేక మేకర్స్ ప్లాన్ చేసిన సర్‌ప్రైజ్‌ను దెబ్బతీస్తాయా? అనే డిస్క‌ష‌న్ కూడా కొనసాగుతోంది. ఏదేమైనా, ఇండియ‌న్ సినిమా ఇప్పుడు కేవలం భారీ కథల దిశగా మాత్రమే కాదు, ప్రపంచ స్థాయి విజువల్ యూనివర్స్‌ల నిర్మాణం వైపూ అడుగులు వేస్తోందనే విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News