బన్నీ, అట్లీ సినిమా... ఇంకా ఆ ఒక్కరు రావాల్సి ఉంది
జాన్వీ ఒక్కతే ఇంకా షూటింగ్ కు రాలేదు. అయితే ఆమె రామ్ చరణ్ తో పెద్ది సినిమాతో బిజీగా ఉంది. రెగ్యులర్ గా ఆ సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది.;
పుష్ప సినిమాల తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమాతో బిజీగా ఉన్నారు. బన్నీ ఈ ప్రాజెక్ట్ కే పూర్తి టైమ్ కేటాయించారు. వేరే సినిమా ఒప్పుకోకుండా కంప్లీట్ గా ఈ సినిమాకే పని చేస్తున్నారు. అంతర్జాతీయ లెవెల్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. సినిమాకు సంబంధించి దర్శకుడు అట్లీ ప్రతీ చిన్న విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెట్ ను దృష్టిలో ఉంచుకొని చేస్తుండడంతో బీ టౌన్ భామ దీపికను మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నారు. మొన్నాఆ మధ్య దీపికకు సంబంధించిన గ్లింప్స్ కూడా వదిలారు. ఆమెతోపాటు మరో ఇద్దరూ హీరోయిన్లకు కూడా అట్లీ క్యారెక్టర్లు రాశారు. ఈ పాత్రల్లో మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ ను ఎంపిక చేశారు. ఇప్పటిదాకా సినిమా నుంచి కన్ఫార్మ్ అయిన పాత్రలు ఇవే.
ఇందులో దీపిక ఇప్పటికే సినిమా పనులు ప్రారంభించగా, మృనాల్ కూడా సెట్స్ లో అడుగుపెట్టింది. ప్రస్తుతం షూటింగ్ ముంబయిలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో మృనాల్ భాగమైంది. ఆమెపై పలు యాక్షన్ సీన్స్ ప్లాన్ చేస్తున్నారు. దీపిక మాదిరిగానే మృనాల్ పై కూడా భారీ యాక్షన్ ఎపిసోడ్ లు ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటిదాకా ఇద్దరు హీరోయిన్లు ప్రాజెక్ట్ తో జాయిన్ అయిపోయారు. ఇక మిగిలింది జాన్వీ కపూరే.
జాన్వీ ఒక్కతే ఇంకా షూటింగ్ కు రాలేదు. అయితే ఆమె రామ్ చరణ్ తో పెద్ది సినిమాతో బిజీగా ఉంది. రెగ్యులర్ గా ఆ సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. ప్రస్తుతం ఈ సినిమా బృందం చిత్రీకరణ కోసం శ్రీలంక వెళ్లింది. అక్కడ కీలక పలు లొకేషన్లలో సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. అయితే పెద్దిలో ఈ షెడ్యూల్ పూర్తయ్యాక.. జాన్వీ ఇండియాకు రానుంది. ఆ తర్వాతే అట్లీ సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఆమె వచ్చిన తర్వాత జాన్వీపై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఆ తర్వాత మూవీ టీమ్ తర్వాతి షెడ్యూల్ కోసం విదేశాలకు వెళ్లనుంది. ఈ సినిమా కోసం అట్లీ ఇంటర్నేషనల్ లెవెల్ టెక్నీషియన్లను దింపుతున్నారు. విఎఫ్ ఎక్స్, గ్రాఫిక్స్ కోసం హాలీవుడ్ నిపుణులు పనిచేయనున్నారు. ఇది సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరెకక్కుతుంది. ఇందులో బన్నీ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేస్తుంది. దాదాపు రూ.700 కోట్ల బడ్జెట్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ భారీ రేంజ్ లో రూపొందిస్తుంది.