ఐకాన్ స్టార్ ఆర్య పారితోషికం ఎంతంటే?

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేష‌న్స్ నిర్మించిన `ఆర్య` చిత్రం అప్ప‌ట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే.;

Update: 2025-07-01 16:30 GMT

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేష‌న్స్ నిర్మించిన `ఆర్య` చిత్రం అప్ప‌ట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. 6 కోట్ల బ‌డ్జెట్ లో నిర్మించిన సినిమా 35 కోట్ల వ‌సూ ళ్ల‌ను సాధించింది. యూత్ పుల్ ల‌వ్ స్టోరీ కి యువ‌త కనెక్ట్ అవ్వ‌డంతో సినిమా ఊహించ‌ని విజ‌యం సాధిం చింది. ఆ సినిమాతోనే బ‌న్నీ, సుకుమార్, దిల్ రాజు కెరీర్ మొద‌లైంది.

అంద‌రూ ఒక్కో సినిమా చేసి రెండ‌వ చిత్రం 'ఆర్య' చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నారు. మ‌రి ఈ సినిమాకు బ‌న్నీ పారితోషికం ఎంత తీసుకున్నాడు? అంటే నిర్మాత‌ల్లో ఒక‌రైన శిరీష్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేసారు. `బ‌న్నీకి పారితోషికం ఎంత ఇవ్వాలో అల్లు అర‌వింద్ గారిని అడిగాం. సినిమా ఆరంభం లోనూ చెప్ప‌లేదు. పూర్త‌యిన త‌ర్వాత చెప్ప‌లేదు. దీంతో ఎంత అడుగుతారో తెలియ‌క మాకు టెన్ష‌న్ మొద‌లైంది.

రిలీజ్ కు ముందు నాలుగు రోజుల ముందు మళ్లీ రాజు వెళ్లి అడిగాడు. అప్పుడు కూడా ఏం చెప్ప‌లేదు. త‌ర్వాత రోజు ప్ర‌సాద్ ల్యాబ్ లో సినిమా వేశాం. సినిమా చూసి ఏం మాట్లాడ‌కుండా అర‌వింద్ గారు కారెక్కి వెళ్లిపోయారు. అప్పుడు రాజు ఇంటికెళ్లి ఇప్ప‌టికైనా చెప్పండ‌ని అడిగితే నైజాంలో కోటి వ‌సూళ్లు సాధిస్తే ప‌ది ల‌క్ష‌లు ఇవ్వండి. రెండు కోట్లు అయితే 20 ల‌క్ష‌లు అని ఇలా లెక్క‌లు చెప్పారు.

కానీ ఐదు కోట్లు వ‌స్తే యాభై ల‌క్ష‌లు వ‌ద్దు. న‌ల‌భై ల‌క్ష‌లే ఇవ్వండి . అదే బ‌న్నీ పారితోషికం. అంత‌కు మించి రూపాయి కూడా ఎక్కువ వ‌ద్దు అన్నారు. నిర్మాత స‌మ‌స్య‌లు ఆయ‌న‌కు తెలుసు కాబ‌ట్టి అర్దం చేసుకు న్నారు. బ‌న్నీ కూడా ఎంతో డౌన్ టౌ ఎర్త్ ఉంటారు. నిర్మాత‌ల‌ను అర్దం చేసుకుంటారు. అందుకే బ‌న్నీ నేడు గొప్ప స్థానంలో ఉన్నాడ‌`న్నారు.

Tags:    

Similar News